సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

డీపీఐఎఫ్ఎఫ్ అవార్డ్స్‌ 2026లో ధురంధర్‌ హవా..

ABN, Publish Date - Nov 21 , 2026 | 02:11 PM

భారతీయ సినీ పరిశ్రమతో పాటు అంతర్జాతీయ వినోద రంగానికి చెందిన ప్రముఖుల ప్రతిభను గుర్తిస్తూ దాదాసాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ అవార్డ్స్‌ (DPIFF) 2026 వేడుకలు ఘనంగా జరిగాయి.

DPIFF Awards 2026

భారతీయ సినీ పరిశ్రమతో పాటు అంతర్జాతీయ వినోద రంగానికి చెందిన ప్రముఖుల ప్రతిభను గుర్తిస్తూ దాదాసాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ అవార్డ్స్‌ (DPIFF) 2026 వేడుకలు ఘనంగా జరిగాయి. నవంబర్ 20న ముంబైలో నిర్వహించిన ఈ అవార్డుల వేడుకలో పలు చిత్రాలు, నటీనటులు సత్తా చాటారు. ముఖ్యంగా ‘ధురంధర్’, ‘సైయారా’, ‘కాంతార: చాప్టర్ 1’ సినిమాలు పలు విభాగాల్లో అవార్డులను సొంతం చేసుకున్నాయి. అంతర్జాతీయ సినీ ప్రముఖులకు కూడా ఈ వేడుకలో పురస్కారాలు అందజేశారు.

‘ధురంధర్‌’కు అవార్డుల పంట

ఈ ఏడాది ఉత్తమ నటుడి పురస్కారాన్ని ‘ధురంధర్’ చిత్రానికి గాను రణ్‌వీర్ సింగ్ అందుకున్నారు. ‘సైయారా’ సినిమాతో ఆకట్టుకున్న అనీత్ పడ్డా ఉత్తమ నటిగా నిలిచారు. ‘ధురంధర్’ దర్శకుడు ఆదిత్య ధర్ ఉత్తమ దర్శకుడి అవార్డును అందుకోగా.. ఇదే చిత్రం ఉత్తమ సినిమాగా ఎంపికైంది. ఈ సినిమాలో ప్రతినాయకుడిగా మెప్పించిన అక్షయ్ ఖన్నాకు కూడా ప్రత్యేక గుర్తింపు లభించింది. ‘ఛావా’ చిత్రానికి గాను వినీత్ కుమార్ సింగ్ ఉత్తమ సహాయ నటుడి అవార్డును అందుకున్నారు. ‘హౌస్‌ఫుల్ 5’లో కామెడీ పాత్రతో అలరించిన రితేశ్ దేశ్‌ముఖ్ ఉత్తమ హాస్య నటుడిగా అవార్డు అందుకున్నారు. 

READ MORE:

గిల్‌ కాదు.. సారా టెండూల్కర్ పెళ్లాడేది ఆ హీరోనా?

డౌట్స్‌లో ‘గాడ్ ఆఫ్ వార్’.. త్రివిక్రమ్ నెక్ట్స్ చిత్రం ఎవరితో..

బాలీవుడ్‌కు ‘గరుడవేగ’ అంజి.. ‘అన్ఎక్స్‌పెక్టెడ్’


‘కాంతార’, ‘సైయారా’కు ప్రత్యేక గుర్తింపు

‘కాంతార: చాప్టర్ 1’ చిత్రానికి క్రిటిక్స్ విభాగంలో ఉత్తమ సినిమా అవార్డు దక్కింది. ఇందులో అద్భుతమైన నటనతో ఆకట్టుకున్న రిషబ్ శెట్టికి క్రిటిక్స్ ఉత్తమ నటుడి పురస్కారం లభించింది. ‘హక్’ చిత్రానికి గాను యామీ గౌతమ్ ధర్  ఉత్తమ నటిగా ఎంపికయ్యారు.  ‘సైయారా’ టైటిల్ సాంగ్‌కు సాంగ్ ఆఫ్ ది ఇయర్ అవార్డు దక్కింది. ‘ధురంధర్’కు సంగీతం అందించిన శాశ్వత్ సచ్‌దేవ్ ఉత్తమ సంగీత దర్శకుడిగా నిలిచారు. ‘సైయారా’ పాటకు గాను ఫహీమ్ అబ్దుల్లాకు ఉత్తమ నేపథ్య గాయకుడి అవార్డు, ఇర్షాద్ కామిల్‌కు ఉత్తమ గీత రచయిత పురస్కారం లభించాయి. భారతీయ సంగీత పరిశ్రమకు చేసిన విశేష సేవలకు గాను దిగ్గజ సంగీత దర్శకుడు ఇళయరాజాను సత్కరించారు.

అంతర్జాతీయ స్థాయిలోనూ పురస్కారాలు

అంతర్జాతీయ విభాగంలో ‘అవతార్: ఫైర్ అండ్ యాష్’ ఉత్తమ అంతర్జాతీయ చిత్రంగా ఎంపికైంది. మైఖేల్ బి. జోర్డాన్ ఉత్తమ అంతర్జాతీయ నటుడిగా, జెస్సీ బక్లీ ఉత్తమ అంతర్జాతీయ నటిగా అవార్డులు అందుకున్నారు. పాప్ సింగర్ టేలర్ స్విఫ్ట్‌కు ఇంటర్నేషనల్ ఆర్టిస్ట్ ఆఫ్ ది ఇయర్ పురస్కారం దక్కింది. ప్రపంచ సినిమాకు చేసిన సేవలకు గాను ప్రముఖ దర్శకుడు జేమ్స్ కామెరూన్‌ను గుర్తించి సత్కరించారు. భారతీయ దిగ్గజ నటుడు కమల్ హాసన్‌కు కూడా సినీ రంగానికి చేసిన విశేష సేవలకు గాను ప్రత్యేకంగా సన్మానించారు. 

Updated Date - Nov 21 , 2026 | 02:44 PM