The India Story: వివాదంలో కాజల్ సినిమా!
ABN , Publish Date - Jul 13 , 2026 | 03:38 PM
'ది ఇండియా స్టోరీ' సినిమాపై నీలినీడలు అలుముకుంటున్నాయి. ఈ మూవీ టీజర్ లో పేర్కొన్న కొన్ని గణాంకలు వాస్తవానికి విరుద్థంగా ఉన్నయని ఆరోపిస్తూ సీబీఎఫ్‌సికి ఫిర్యాదు వెళ్ళింది.
కాజల్, శ్రేయాస్ తల్పాడే కీలక పాత్రలు పోషించిన హిందీ సినిమా 'ది ఇండియా స్టోరీ'. ఈ నెల 24న ఈ సినిమా హిందీతో పాటు తెలుగు, తమిళ భాషల్లోనూ విడుదల కాబోతోంది. చేతన్ డీకే దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు సాగర్ బి షిండే కథను అందించి, నిర్మిస్తున్నారు. ఈ కోర్ట్ రూమ్ డ్రామా ప్రజలు తీసుకునే ఆహారాన్ని విషతుల్యం చేస్తున్న ఎరువుల నేపథ్యంతో రూపుదిద్దుకుంది. విషపూరిత పురుగు మందుల వ్యవసాయం, దాని వల్ల ప్రజల ఆరోగ్యంపై పడుతున్న తీవ్ర ప్రభావం వంటి అంశాల ఆధారంగా దీనిని తెరకెక్కించారు. 'స్లో పాయిజన్ ఇన్ ప్రోగ్రెస్' అనేది ఈ మూవీ ట్యాగ్ లైన్.
ఇదిలా ఉంటే... తాజాగా విడుదలైన టీజర్ లో భారత వ్యవసాయం, పురుగు మందుల వినియోగం, ఆహార భద్రతపై ఇచ్చిన గణాంకాలు వాస్తవానికి విరుద్ధంగా ఉన్నాయనే విమర్శలు వస్తున్నాయి. ఈ విషయంలో ఆగ్రో కెమికల్ రంగానికి చెందిన ఓ ప్రముఖ సంస్థ సీబీఎఫ్‌సి (సెంట్రల్ బోర్డ్ ఫాఫ్ ఫిల్మ్ సర్టిఫికెషన్)ను ఆశ్రయించింది. ఈ సినిమాకు సెన్సార్ సర్టిఫికెట్ ఇచ్చే ముందు వాస్తవ పరిస్థితులను తెలుసుకోవాలని కోరింది. ఈ మూవీ తాజా టీజర్‌లో శాస్త్రీయ ఆధారాలను చూపకుండా ప్రజలలో భయాందోళనలకు కలిగించేలా ఉందని ఫిర్యాదు దారులు పేర్కొన్నారు. ఇలాంటి ప్రచారం వల్ల రైతులు, వ్యవసాయ రంగం, వ్యవసాయ ఉత్తత్తులపై ప్రభావం పడే ఆస్కారం ఉందని వారు సి.బి.ఎఫ్.సి.కి ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నట్టు తెలుస్తోంది. అలానే ఈ సినిమాలో పేర్కొన్న అంశాలకు తగిన ఆధారాలు చూపించవలసిందని కోరుతూ నిర్మాతలకు ఇప్పటికే కోర్ట్ నోటీసులు ఇచ్చిందనే ప్రచారం కూడా జరుగుతోంది.
ఈ నేపథ్యంలో హిందీ, తెలుగు, తమిళ భాషల్లో ఈ నెల 24న విడుదల కావాల్సిన 'ది ఇండియా స్టోరీ'పై నీలినీడలు కమ్ముకున్నాయనిపిస్తోంది. ఈ చిత్రానికి నిశాంత్ భగవత్ సినిమాటోగ్రఫీ అందించగా, మంగేష్ ధాక్డే సంగీతం సమకూరుస్తున్నారు. ఆశిష్ మత్రే ఎడిటింగ్, షకీల్ అజ్మీ సాహిత్యం, అన్మోల్ భావే సౌండ్ డిజైనర్.
ఇవి కూడా చదవండి:
మహేశ్ బాబాయ్ మెచ్చుకున్నారు! ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కు వస్తారు
నితిన్‌తో.. నాని సినిమా! ఈ సారైనా.. హిట్టు పడేనా?
విజయ్ ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్! ‘జననాయగన్’ మళ్లీ వాయిదా..