మహేశ్ బాబాయ్.. మెచ్చుకున్నారు! ఫ్రీ రిలీజ్.. ఈవెంట్‌కు వస్తారు
ABN , Publish Date - Jul 13 , 2026 | 06:47 AM
మహేశ్‌బాబు అన్న కుమారుడు జయ కృష్ణ ఘట్టమనేని హీరోగా పరిచయమవుతున్న చిత్రం ‘శ్రీనివాస మంగాపురం’
సీనియర్ నటుడు కృష్ణ, హీరో మహేశ్‌బాబు అన్న కుమారుడు జయ కృష్ణ ఘట్టమనేని (Jaya Krishna Ghattamaneni) హీరోగా పరిచయమవుతున్న చిత్రం ‘శ్రీనివాస మంగాపురం’ (Srinivasa Mangapuram). అజయ్ భూపతి దర్శకత్వంలో వైజయంతీ మూవీస్ పతాకంపై అశ్వినీదత్ సమర్పిస్తున్నారు. చందమామ కథలు బ్యానర్‌పై పి. కిరణ్ నిర్మిస్తున్నారు. నటి రవీనా టాండన్ కుమార్తె రాషా తడానీ (Rasha Thadani) కథానాయిక. సీనియర్ నటుడు మోహన్‌బాబు (Mahesh Babu) కీలక పాత్రలో కనిపించనున్నారు. సినిమా ఈ నెల 30న విడుదలవుతోన్న సందర్భంగా ఆదివారం విజయవాడలో ట్రైలర్‌ను విడుదల చేశారు. ఇందులో హీరోహీరోయిన్ మధ్య వచ్చే సన్నివేశాలు, సంభాషణలు, పోరాట ఘట్టాలు, సంగీతం, విజువల్స్ ఆకట్టుకున్నాయి.
ఈ కార్యక్రమంలో జయ కృష్ణ మాట్లాడుతూ ‘మా తాత కృష్ణ నాకు దేవుడితో సమానం. ఆయన లేకపోతే నేను లేను. ఈ సినిమా విషయంలో బాబాయ్ మహేశ్‌బాబు నాకెంతో సపోర్ట్ చేశారు. మా సినిమా టీజర్, ట్రైలర్‌కు అద్భుతమైన ఫీడ్‌బ్యాక్ ఇచ్చారు. ఈ చిత్రంలోని పాత్రలతో ప్రతీ ఒక్కరూ కనెక్ట్ అవుతారు’ అని అన్నారు. అజయ్ భూపతి మాట్లాడుతూ ‘ఇందులో మంచి యాక్షన్‌తో పాటూ అందరి హృదయాలను తాకే బలమైన ప్రేమకథ ఉంటుంది. యూత్‌కు బాగా చేరువవుతుంది’ అని చెప్పారు.
ఘట్టమనేని ఆదిశేషగిరి రావు మాట్లాడుతూ ‘ట్రైలర్‌లాగే సినిమా కూడా అదిరిపోతుంది. జయకృష్ణ అందంగా కనిపించడమే కాకుండా గొప్పగా నటించాడు. ఆయన కెరీర్‌కు ఈ చిత్రం మంచి ఆరంభాన్నిస్తుంది’ అని తెలిపారు. ‘ఈ సినిమా తప్పకుండా ఘనవిజయం సాధిస్తుంది’ అని ఎంపీ కేశినేని శివనాథ్ పేర్కొన్నారు. ‘శ్రీనివాస మంగాపురం’ చిత్రాన్ని మీరంతా కచ్చితంగా ఎంజాయ్ చేస్తారు’ అని రషా తడానీ తెలిపారు. ‘ఈ సినిమా కోసం జయకృష్ణ చాలా కష్టపడ్డారు. ఈ చిత్రం ప్రేక్షకులకు నచ్చుతుంది’ అని టీడీపీ నాయకుడు బుద్దా వెంకన్న చెప్పారు.