Batwara: పెండింగ్‌లో ఓటీటీ డీల్‌!

ABN , Publish Date - Aug 25 , 2026 | 01:59 PM

సన్నీ డియోల్ హీరోగా ఆమిర్ ఖాన్ నిర్మించిన 'బట్వారా 1947' సినిమా బాక్సాఫీస్ బరిలో పరాజయం పాలైంది. దాంతో ఓటీటీ డీల్‌ సందిగ్థంలో పడింది.

Batwara movie

సన్నీ డియోల్ హీరోగా దేశ విభజన గాథ నేపథ్యంలో ఆమిర్ ఖాన్ నిర్మించిన 'బట్వారా 1947' చిత్రం ఆగస్ట్ 14న విడుదలైంది. ఈ సినిమా బాక్సాఫీస్ బరిలో చాలా పేలవమైన ప్రభావాన్ని చూపించింది. దీనికి ముందు ఇదే తరహాలో వచ్చిన 'మై వాపస్ ఆవుంగా' దీనికంటే బెటర్ గా పెర్ఫార్మ్ చేసిందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. 'బట్వారా' చిత్రంతో ఆమిర్ ఖాన్‌కు దాదాపు 90 కోట్ల నష్టం వచ్చిందని అంచనా వేస్తున్నారు. అయితే ఇప్పుడీ సినిమా ఓటీటీ డీల్ సందిగ్థంలో పడింది. నిజానికి సినిమా రిలీజ్ కు ముందు ఓ ప్రముఖ ఓటీటీ సంస్థ రూ. 125 కోట్లను ఆఫర్ చేసిందట. కానీ అప్పుడు అందుకు ఆమిర్ ఖాన్ అంగీకరించలేదని తెలిసింది. ఇప్పుడు సినిమా విడుదలై పరాజయం పాలు కావడంతో ఏ ఓటీటీ ప్లాట్‌ ఫామ్ కూడా దీని హక్కులపై ఆసక్తి చూపడం లేదట.


'బట్వారా' సినిమా విడుదలకు ముందే ఓటీటీ డీల్‌ కుదర్చుకోమని, ఆ కారణంగా ఆర్థికంగా ఉపయోగపడుతుందని ఆమిర్‌కు సన్నీడియోల్ చెప్పినట్టు వార్తలు వచ్చాయి. అయితే ఆయన దానిని ఖండించారు. తమ మధ్య ఓటీటీ డీల్‌కు సంబంధించి ఎలాంటి చర్చ జరగలేదని ఆయన అన్నారు. 'బట్వారా' సినిమా విషయంలో తాను గర్వం పడుతుంటానని, బాక్సాఫీస్ ఫలితాలు సినిమా క్వాలిటీని ప్రతిఫలించవని ఆయన తెలిపారు. తన తండ్రి కెరీర్ లో హృషికేశ్ ముఖర్జీ తీసిన 'సత్యకామ్‌' ఉత్తమ చిత్రంగా తాను భావిస్తానని, కాని ఆ సినిమా బాక్సాఫీస్ దగ్గర భారీ పరాజయాన్ని చవిచూసిందని సన్నీ డియోల్ చెప్పారు. అయితే 'బట్వారా' నష్టాలు రాబోయే రోజుల్లో భర్తీ అవుతాయనే ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు.

ఇవి కూడా చదవండి:

Arjun Das: దర్శకుడు ఏ మాత్రం తగ్గలేదు..

ఇరుముడి మణమ్మ జీవితంలో ఇంత విషాదమా.. కన్నీళ్లు వచ్చేస్తాయి

రష్మిక తల్లి కాబోతుందా...

Updated Date - Aug 25 , 2026 | 02:05 PM