AR Rahman: ‘రామాయణ’ పాటల విమర్శలపై రెహమాన్ ఘాటు స్పందన!
ABN , Publish Date - Nov 02 , 2026 | 02:18 PM
ఇప్పటి వరకు విడుదలైన ‘రామాయణ’ సినిమా పాటలపై పలు విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే.
ఇప్పటి వరకు విడుదలైన ‘రామాయణ’(Ramayana) సినిమా పాటలపై పలు విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే. నితేశ్ తివారీ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాకి రెహమాన్ (AR Rahman) సంగీతం అందిస్తున్నారు. రణ్‌బీర్ కపూర్, సాయిపల్లవి, ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతోన్న ఈ చిత్రం.. రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రానుంది. పార్ట్ 1 దీపావళి కానుకగా నవంబరు 5న విడుదల కానుంది. ఇటీవల విడుదలైన ‘మంగళ్ రంగ్’ పాట సంగీతాన్ని కొందరు విమర్శించారు.
ఈ నేపథ్యంలో ఓ ఇంటర్వ్యూలో రెహమాన్ మాట్లాడారు. ‘ఒక పాట తుది రూపం దాల్చడానికి ఎంతో ఆలోచన, సమయం కావాలి. దేనిని అంత తొందరగా అంచనా వేయకూడదు. స్వరాలు కూడా పాతబడే కొద్దీ రుచిగా మారతాయి. కొన్నిసార్లు మానవ సంస్కృతి, సంప్రదాయాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలి. ప్రేక్షకులు ఒక కోణాన్ని మాత్రమే చూస్తారు. అందుకే కాస్త ఓపిక పట్టాలి. ఒక ప్రాంతాన్ని తీసుకుంటే అక్కడ ఏ ఒక్కరి అభిప్రాయము ఒకలా ఉండదు. ఒక్కొక్కరికి ఒక్కో అభిరుచి ఉంటుంది. అన్ని అందరికి నచ్చాలని రూల్ లేదు. అలాగే ఒక టెక్నిషియన్ అందరిని మెప్పించేలా పని చేయలేడు. తనకు ఇచ్చిన టాస్క్ ఏంటో దానికి తగ్గట్టు పని చేసుకుంటాడు. దానికోసం 100 శాతం ఎఫర్ట్ పెడతాడు. అందరి సంతృప్తిపరచాలనుకుంటే ఐస్‌క్రీమ్ అమ్ముకోవాలి' అని అన్నారు. అలాగే హాలీవుడ్ సంగీత దర్శకుడు హాన్స్ జిమ్మర్ ఈ సినిమాలో భాగం కావడం వల్ల అంతర్జాతీయ ప్రేక్షకుల్లో ఈ చిత్రంపై ఆసక్తి పెరుగుతోంది. ఐదు భాషల్లో, హాలీవుడ్, భారతీయ వెర్షన్లకు వేర్వేరుగా సంగీతం అందించాల్సి వచ్చింది. దాదాపు పది చిత్రాలకు పని చేసినట్లుగా అనిపించింది’’ అని రెహమాన్ తెలిపారు.
ఇవి కూడా చదవండి:
టాలీవుడ్ స్టార్ హీరోలూ.. సూర్య, ధనుష్‌లను చూసి నేర్చుకోండయ్యా..
King: ‘కింగ్’.. ఫస్ట్ సాంగ్.. చూసేయండి
డ్రాగన్' కోసం 'ధురంధర్' మ్యూజిక్ డైరెక్టర్