డ్రాగన్' కోసం 'ధురంధర్' మ్యూజిక్ డైరెక్టర్
ABN , Publish Date - Nov 02 , 2026 | 08:44 AM
సినిమా విజయంలో సంగీతానిది కీలక పాత్ర అన్నది నిజం. కథకు తగ్గట్టుగా పాటలు, సన్నివేశాలకు అనుగుణంగా నేపథ్య సంగీతం అందించేందుకు దర్శకనిర్మాతలు ప్రత్యేక దృష్టి పెడుతున్నారు.
సినిమా విజయంలో సంగీతానిది కీలక పాత్ర అన్నది నిజం. కథకు తగ్గట్టుగా పాటలు, సన్నివేశాలకు అనుగుణంగా నేపథ్య సంగీతం అందించేందుకు దర్శకనిర్మాతలు ప్రత్యేక దృష్టి పెడుతున్నారు. ఎన్టీఆర్ హీరోగా ప్రశాంత్ నీల్ రూపొందిస్తున్న చిత్రం ‘డ్రాగన్’(Dragon). గ్యాంగ్‌స్టర్ నేపథ్యంలో సాగే యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ఎన్టీఆర్ పవర్‌ఫుల్ లూగర్ పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రానికి తొలుత రవి బస్రూర్ సంగీత బాధ్యతలు తీసుకున్నారు. ఈ సినిమా నుంచి విడుదలైన ప్రచార చిత్రాలకు ఆయనే సంగీతం అందించారు. అయితే తాజాగా కొన్ని పాటల కోసం ‘ధురంధర్’ చిత్రంతో గుర్తింపు తెచ్చుకున్న సంగీత దర్శకుడు శాశ్వత్ సచ్‌దేవ్(Shashwat Sachdev) ను కూడా తీసుకోవాలని చిత్రబృందం భావిస్తున్నట్లు తెలిసింది.
ఈ సినిమాలో పాటలతో పాటు బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలవాలనే ఉద్దేశంతోనే ఇద్దరు సంగీత దర్శకుల సేవలను వినియోగించుకోవాలని చూస్తున్నట్లు సమాచారం. అయితే శాశ్వత్ సచ్‌దేవ్ భాగస్వామ్యంపై చిత్ర యూనిట్ నుంచి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. భారీ అంచనాల మధ్య రూపొందుతున్న ఈ సినిమా వచ్చే ఏడాది జూన్‌లో ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఇవి కూడా చదవండి:
టాలీవుడ్ స్టార్ హీరోలూ.. సూర్య, ధనుష్‌లను చూసి నేర్చుకోండయ్యా..
RC17: యు కెన్ ఇమాజిన్.. అనౌన్స్‌మెంట్ పోస్టర్‌కు అర్థమేంటి?
NBK112: కొరటాల సినిమాకు బాలయ్య రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా?