సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

అమితాబ్‌ బచ్చన్‌ పోస్ట్‌ వెనుక అసలు కారణం ఇదేనా?

ABN, Publish Date - Nov 16 , 2026 | 02:30 PM

బాలీవుడ్‌ అగ్ర కథానాయకుడు అమితాబ్‌ బచ్చన్‌ తాజాగా చేసిన  పోస్ట్‌ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

బాలీవుడ్‌ అగ్ర కథానాయకుడు అమితాబ్‌ బచ్చన్‌ (Amitabh Bachchan)చేసిన ఓ సోషల్‌ మీడియా పోస్ట్‌ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. గత కొంతకాలంగా బాలీవుడ్‌ ప్రముఖులకు బెదిరింపులు వస్తున్న నేపథ్యంలో ఆయన చేసిన రెండు పదాల వ్యాఖ్య అభిమానుల్లో ఆందోళన కలిగిస్తోంది. నవంబరు 15 అర్ధరాత్రి తన ఎక్స్‌ (X) ఖాతాలో ‘బతికి బయటపడ్డాం’ అంటూ పోస్ట్‌ చేశారు. అయితే ఈ వ్యాఖ్యలను ఏ సందర్భంలో చేశారనే విషయాన్ని వెల్లడించలేదు.

ఇదే సమయంలో అమితాబ్‌ నివాసమైన ముంబయిలోని ‘జల్సా’ను లక్ష్యంగా చేసుకుని కాల్పులు జరిపేందుకు లారెన్స్‌ బిష్ణోయ్‌ గ్యాంగ్‌కు చెందిన కొందరు వ్యక్తులు కుట్ర పన్నినట్లు దిల్లీ పోలీసుల దర్యాప్తులో వెల్లడైనట్లు సమాచారం. ఈ కేసులో ఇద్దరు అనుమానిత షూటర్లను పోలీసులు అరెస్టు చేసి విచారిస్తున్నారు. దీంతో అమితాబ్‌ తాజా పోస్ట్‌పై ఆసక్తి నెలకొంది. అయితే ఈ వ్యాఖ్యలకు దాడి కుట్రతో సంబంధం ఉందా అనే దానిపై స్పష్టత లేదు.

నెల రోజుల్లో మూడు బాంబు బెదిరింపులు

మరోవైపు, గత నెల రోజుల వ్యవధిలో అమితాబ్‌ నివాసం జల్సాకు మూడుసార్లు బాంబు బెదిరింపులు వచ్చాయి. అక్టోబరు 23, నవంబరు 6, నవంబరు 12 తేదీల్లో ఈ-మెయిల్స్‌ ద్వారా బెదిరింపులు అందినట్లు సమాచారం. దీంతో ముంబయి పోలీసులు ఆయన ఇంటి వద్ద భద్రతను పెంచారు. అదనపు బలగాలను మోహరించడంతో పాటు బారికేడ్లు ఏర్పాటు చేశారు.

ఇటీవల బాలీవుడ్‌ ప్రముఖులకు వరుసగా బెదిరింపులు వస్తున్న నేపథ్యంలో అమితాబ్‌ భద్రతపై అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇంతకీ ఆయన ‘బతికి బయటపడ్డాం’ అంటూ చేసిన పోస్ట్‌ వెనుక అసలు కారణం ఏమిటన్నది తెలియాల్సి ఉంది.

ఇవి కూడా చదవండి:

తనిష్క్ దోపిడీ.. అరెస్టు తర్వాత పెరిగిన యూట్యూబర్ మీనాక్షి ఫాలోవర్స్

Ashika Ranganath: అల్లు అర్జున్ తో పని చేయడం చాలా బావుంది

కాకా.. వెంకటేష్ హీరోయిన్ తో చిరు స్టెప్పులు

Updated Date - Nov 16 , 2026 | 04:01 PM