ఆ హీరోయిన్‌తో ‘ఓకే జాను’ హీరో డేటింగ్ నిజమేనట!
ABN , Publish Date - May 04 , 2026 | 02:31 PM
బాలీవుడ్ లో ఇప్పుడు సినిమాల కంటే స్టార్ల వ్యక్తిగత జీవితాల చుట్టూనే ఎక్కువగా వార్తలు నడుస్తున్నాయి. మరీ ముఖ్యంగా హీరోహీరోయిన్ల డేటింగ్‌కు సంబంధించి, ఏ చిన్న టాపిక్ వచ్చినా.. అది సెన్సేషన్‌గా మారుతోంది.
బాలీవుడ్ లో ఇప్పుడు సినిమాల కంటే స్టార్ల వ్యక్తిగత జీవితాల చుట్టూనే ఎక్కువగా వార్తలు నడుస్తున్నాయి. మరీ ముఖ్యంగా హీరోహీరోయిన్ల డేటింగ్‌కు సంబంధించి, ఏ చిన్న టాపిక్ వచ్చినా.. అది సెన్సేషన్‌గా మారుతోంది. గతంలో ఇలాంటి డేటింగ్ వ్యవహారాల అనంతరం సెలబ్రిటీలు కొందరు మ్యారేజ్ చేసుకున్న వారు కూడా ఉన్నారు. ప్రస్తుతం బాలీవుడ్‌లో ఇలాంటి విషయాలు కామన్‌గా మారిపోరాయి. ఇప్పుడీ కామన్ పాయింట్‌లోకి మరో కొత్త జంట వచ్చి చేరారు. వారెవరంటే...
‘ఆషికీ2’, ‘ఓకే జాను’ చిత్రాల ఫేమ్ ఆదిత్య రాయ్ కపూర్ (Aditya Roy Kapur).. ‘తడప్’, ‘హీరోపంతి 2’ ఫేమ్ తారా సుతారియా (Tara Sutaria) డేటింగ్‌లో ఉన్నారంటూ బాలీవుడ్ మీడియా సర్కిల్స్‌లో వార్తలు సెన్సేషన్‌గా మారాయి. బాలీవుడ్‌లోని ప్రధాన మీడియా సంస్థలు వీరిద్దరూ డేటింగ్‌లో ఉన్నారని అధికారికంగా ధృవీకరించడంతో.. సోషల్ మీడియాలో వారిద్దరి గురించే డిస్కషన్ నడుస్తోంది. ఇటీవల జరిగిన పలు సినీ వేడుకలు, ప్రైవేట్ పార్టీల్లో వీరిద్దరూ జంటగా కనిపించడంతో అభిమానులకు ముందే అనుమానం వచ్చింది. కొన్నిరోజులుగా వీరి రిలేషన్‌పై వార్తలైతే వినిపిస్తున్నాయి కానీ, అధికారికంగా ఎక్కడా రివీల్ కాలేదు. ఇప్పుడు ప్రధాన మీడియా సంస్థలే కన్ఫర్మ్ చేయడంతో.. ఇద్దరి మధ్య రిలేషన్ నిజమే అనేలా ఫ్యాన్స్ కూడా ఫిక్స్ అవుతున్నారు.
ఈ ఇద్దరు నటులు తమ వ్యక్తిగత విషయాలను గోప్యంగా ఉంచినప్పటికీ, వరుసగా జంటగా కనిపిస్తుండటం మాత్రం వారి మధ్య ఏదో ఉందనే విషయాన్ని స్పష్టం చేస్తోంది. 2026 ప్రారంభంలో ముంబైలో తారా సుతారియా తన కొత్త ఇంటికి మారిన సమయంలోనూ ఈ జోడీ సందడి చేయడం విశేషం. సోషల్ మీడియాలో నెటిజన్లు వీరిని ‘పవర్ కపుల్’ అంటుంటే.. వీరి క్లాసిక్, సైలెంట్ పర్సనాలిటీలు ఒకరికొకరు పర్ఫెక్ట్‌గా సెట్ అవుతాయని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం వీరిద్దరూ చేతినిండా అవకాశాలతో బిజీ బిజీగా ఉన్నారు. యష్ ‘టాక్సిక్’లో తారా సుతారియా ఓ కీలక పాత్రను పోషిస్తోన్న విషయం తెలిసిందే. ఆదిత్య రాయ్ కపూర్ విషయానికి వస్తే.. ఇంతకు ముందు అనన్యా పాండేతో పాటు పలువురితో ప్రేమాయణం నడపగా, తారా సుతారియా కూడా వీర్‌తో కొన్నాళ్లపాటు డేటింగ్‌లో ఉన్నట్లుగా టాక్ నడిచిన విషయం తెలిసిందే.
ఇవి కూడా చదవండి:
త్రిష బర్త్‌డే.. విజయంతో విజయ్ ట్రీట్ ఇస్తాడా? లేక!
‘సన్ రైజర్స్’కు సపోర్ట్ చేస్తున్న ఈ భామ ఎవరో గుర్తు పట్టారా?
Varanasi: ‘వారణాసి’కి వాటర్ కొరత!.. మహేష్ సినిమాకు ప్రభుత్వం షాక్!
‘పెద్ది’తో ఫైట్‌కు మహేష్ బాబు ఓకే అంటాడా?