ఆమిర్ ఖాన్, సాయి పల్లవిలకు ‘ఒకే రోజు’ బిగ్ షాక్!
ABN , Publish Date - May 02 , 2026 | 04:42 PM
సినిమాల ఎంపిక విషయంలో నటి సాయి పల్లవి మైండ్‌సెట్ ఎలా ఉంటుందో అందరికీ తెలిసిన విషయమే. తన పాత్రకు ఇంపార్టెన్స్ ఉంటేనే, ఆమె సినిమా ఓకే చేస్తారు. అలాంటి ఆమెకు ఇప్పుడు బిగ్ షాక్ తగిలింది.
సినిమాల ఎంపిక విషయంలో నటి సాయి పల్లవి (Sai Pallavi) మైండ్‌సెట్ ఎలా ఉంటుందో అందరికీ తెలిసిన విషయమే. తన పాత్రకు ఇంపార్టెన్స్ ఉంటేనే, ఆమె సినిమా ఓకే చేస్తారు. అలాగే, వల్గర్‌గా కనిపించే పాత్రలకు కూడా ఆమె ఆమడ దూరం ఉంటారనేది తెలియంది కాదు. ఈ క్రమంలో ఆమె వరుసగా బాలీవుడ్ అవకాశాలు వచ్చినా, వాటిని తిరస్కరిస్తూ వచ్చారు. కానీ, అగ్ర నటుడు ఆమిర్ ఖాన్ (Aamir Khan) నిర్మించిన ‘ఏక్ దిన్’ (Ek Din) చిత్రంతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఆమె, ఆ వెంటనే ‘రామాయణ’ అనే మరో సినిమాకు ఓకే చెప్పారు. ‘రామాయణ’ ప్రస్తుతం సెట్స్‌పై ఉండగా, ఆమె నటించిన మొదటి బాలీవుడ్ చిత్రమైన ‘ఏక్ దిన్’.. మే 1న థియేటర్లలో విడుదలై షాక్ ఇచ్చింది. ఈ రొమాంటిక్ సాగాలో ఆమిర్ ఖాన్ కుమారుడు జునైద్ ఖాన్, సాయి పల్లవి ప్రధాన పాత్రలు పోషించారు.
మే డే స్పెషల్‌గా విడుదలైన ఈ సినిమా ‘ఒకే రోజు’ అటు సాయి పల్లవికే కాకుండా, ఇటు ఆమిర్ ఖాన్‌కు కూడా ఊహించని షాక్ ఇచ్చింది. ఈ సినిమాకు నెగిటివ్ టాక్ రావడంతో.. మొదటి రోజు కలెక్షన్స్ విషయంలో ఈ సినిమా భారీ పరాజయాన్ని చవిచూడక తప్పలేదు. ఆమిర్ ఖాన్, సాయి పల్లవి వంటి పేర్లు ఉన్నప్పటికీ, ఒక హిందీ సినిమాకు ఈ స్థాయి వసూళ్లు రావడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. అందుకు కారణం ప్రేక్షకుల నుంచి ఈ సినిమాకు ఆశించిన ఆదరణ లభించకపోవడమే. సాయి పల్లవి శ్రమ అంతా వృథా అయిందని మెజారిటీ రివ్యూలు పేర్కొంటున్నాయి. కాకపోతే, ఆమె నటనకు మాత్రం మంచి మార్కులే పడుతున్నాయి.
ఈ సినిమా ప్రమోషన్స్ విషయానికి వస్తే.. వారం క్రితం ముంబైలో ఓ ప్రీమియర్ షోను ఆమిర్ ఖాన్ ఏర్పాటు చేశారు. ఈ షోలో ఆమిర్ ఖాన్ కన్నీళ్లు పెట్టుకున్న వీడియో వైరలైన విషయం తెలిసిందే. మొదటి నుంచి ఈ సినిమాను మేకర్స్ భారీగా ప్రమోట్ చేస్తూ వచ్చారు. మే డే హాలీడే రోజున, బాక్సాఫీస్ వద్ద పెద్ద పోటీ లేకపోయినప్పటికీ.. ఈ సినిమా కనీస ఓపెనింగ్స్ సాధించలేక చేతులెత్తేసింది. ముఖ్యంగా యువత ఈ రొమాంటిక్ డ్రామాను వెండితెరపై చూడటానికి ఆసక్తి చూపడం లేదు. దీంతో సాయి పల్లవి బాలీవుడ్ ఎంట్రీ చాలా నిరాశాజనకంగా మొదలైందని చెప్పక తప్పదు. ఈ చిత్రానికి సునీల్ పాండే దర్శకత్వం వహించగా, ఇది 2016 నాటి థాయ్ చిత్రం ‘వన్ డే’ (One Day)కి రీమేక్‌గా రూపొందించారు.
ఇవి కూడా చదవండి:
‘నా పెళ్ళాం నిప్పు రా’.. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పోస్ట్ వైరల్!
తొక్కలో ఇంటర్వ్యూ.. అంటూ కుర్చీ విసిరేసి వెళ్లిపోయిన గెటప్ శ్రీను!
కయాదు లోహర్ గురించి ఈ విషయాలు తెలుసా?