Sai Pallavi : భావోద్వేగానికి గురయ్యా

ABN , Publish Date - Dec 21 , 2024 | 03:44 AM

‘ఎన్నో గొప్ప చిత్రాలను, గట్టి పోటీని తట్టుకుని అవార్డుని దక్కించుకున్నందుకు నాకు ఎంతో సంతోషంగా, గర్వంగా ఉంది. అభిమానుల ప్రేమకు భావోద్వేగానికి గురయ్యా’ అని ఆనందం వ్యక్తం చేశారు నటి సాయిపల్లవి.

‘ఎన్నో గొప్ప చిత్రాలను, గట్టి పోటీని తట్టుకుని అవార్డుని దక్కించుకున్నందుకు నాకు ఎంతో సంతోషంగా, గర్వంగా ఉంది. అభిమానుల ప్రేమకు భావోద్వేగానికి గురయ్యా’ అని ఆనందం వ్యక్తం చేశారు నటి సాయిపల్లవి. చెన్నైలో నిర్వహించిన ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో ‘అమరన్‌’ చిత్రానికి ఉత్తమ నటిగా సాయిపల్లవి, ‘మహారాజ’ చిత్రానికి ఉత్తమ నటుడిగా విజయ్‌ సేతుపతి అవార్డులు అందుకున్నారు. ఈ సందర్భంగా సాయిపల్లవి స్పందిస్తూ ‘ముకుంద్‌ కుటుంబ సభ్యుల వల్లే ఇది సాధ్యమైంది. ఈ కథను ప్రపంచానికి చెప్పడానికి వాళ్లు అంగీకరించడం వల్లనే ‘అమరన్‌’ చిత్రాన్ని రూపొందించగలిగాం’ అని వివరించారు. కాగా, ‘మహారాజ’ను ఆదరించిన ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలిపారు విజయ్‌ సేతుపతి.

Updated Date - Dec 21 , 2024 | 03:44 AM