Yash Raj Films: విడుదలైన సైయారా టీజర్

ABN , Publish Date - May 30 , 2025 | 06:33 PM

యశ్ రాజ్ ఫిల్మ్స్ నిర్మాణంలో మోహిత్ సూరి తెరకెక్కించిన చిత్రం ‘సైయారా’. ఈ సంస్థ నుండి వచ్చే ప్రేమ కథాచిత్రాలకు ఉండే ఫాలోయింగ్, క్రేజ్ అందరికీ తెలిసిందే. ప్రేక్షకుల అంచనాలకు తగ్గట్టుగానే ‘సైయారా’ చిత్రాన్ని మేకర్స్ తెరకెక్కించారు.

యశ్ రాజ్ ఫిల్మ్స్ (Yash Raj Films) నిర్మాణంలో మోహిత్ సూరి తెరకెక్కించిన చిత్రం ‘సైయారా’ (Saiyaara). ఈ సంస్థ నుండి వచ్చే ప్రేమ కథాచిత్రాలకు ఉండే ఫాలోయింగ్, క్రేజ్ అందరికీ తెలిసిందే. ప్రేక్షకుల అంచనాలకు తగ్గట్టుగానే ‘సైయారా’ చిత్రాన్ని మేకర్స్ తెరకెక్కించారు. అహాన్ పాండేను హిందీ చిత్ర పరిశ్రమకు ఈ చిత్రంతోనే హీరోగా పరిచయం చేస్తున్నారు. ఈ క్రమంలో అహాన్ పాండే (Ahaan Panday), అనీత్ (Aneet Padda) జంట ఎలా ఉండబోతోంది? అసలు వారిద్దరి ప్రపంచం ఎలా ఉంటుందో తెలియజేసేందుకు టీజర్‌ను విడుదల చేశారు దర్శక నిర్మాతలు. ఇంటెన్స్ లవ్ స్టోరీగా 'సైయారా' చిత్రాన్ని కంపెనీ సీఇఓ అక్షయ్ విధాని నిర్మించారు.


'సైయారా' టీజర్ చూస్తుంటే ఇది నేటి ట్రెండ్‌కు తగ్గట్టుగా ఉండే ప్రేమకథ అని అర్థం అవుతోంది. హీరో హీరోయిన్ల పరిచయం, ప్రేమ, బ్రేకప్ వంటి సీన్లతో టీజర్‌ను అందంగా మలిచారు. ఇద్దరి నటన ఈ టీజర్‌కు ప్రత్యేక ఆకర్షణ అని చెప్పుకోవచ్చు. ఇక విజువల్స్, మ్యూజిక్ ఈ చిత్రానికి మేజర్ అస్సెట్‌ కానున్నాయి. సైయారా అంటే ఆకాశంలోని ఒంటరి తార అని టీజర్ చూస్తే అర్థం అవుతోంది. 50 సంవత్సరాల యశ్ రాజ్ ఫిల్మ్స్ చరిత్రలో ఎన్నో కల్ట్ రొమాంటిక్, ప్రేమ కథా చిత్రాలు వచ్చాయి. ఇక మోహిత్ సూరి (Mohit Suri) సైతం 'ఆషికి 2', 'మలంగ్', 'ఏక్ విలన్' వంటి రొమాంటిక్ చిత్రాలకు దర్శకత్వం వహించాడు. 'సైయారా’ జూలై 18, 2025న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.

Also Read: Bhairavam Review: ముగ్గురు హీరోల 'భైరవం' ఎలా ఉందంటే...

Also Read: Shashtipoorthi : షష్టిపూర్తి సినిమా రివ్యూ...

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

Updated Date - May 30 , 2025 | 06:49 PM