Director Vikranth Rudhra: ఇన్ స్పైరింగ్ గా 'అర్జున్ చక్రవర్తి' టీజర్
ABN , Publish Date - Jul 28 , 2025 | 06:24 PM
కబడ్డీ నేపథ్యంలో ఇప్పటికే తెలుగులో పలు చిత్రాలు వచ్చాయి. అయితే... పూర్తి స్థాయిలో అలాంటిదే మరో సినిమా రాబోతోంది. రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా 'అర్జున్ చక్రవర్తి' అనే సినిమాను విక్రాంత్ రుద్ర రూపొందించారు.
విజయ రామరాజు (Vijaya Ramaraju) టైటిల్ రోల్ పోషించిన స్పోర్ట్స్ డ్రామా ‘అర్జున్ చక్రవర్తి' (Arjun Chakravarthi). విక్రాంత్ రుద్ర (Vikranth Rudra) దర్శకత్వం వహించిన ఈ సినిమాని నిర్మాత శ్రీని గుబ్బల నిర్మించారు. ఇప్పటికే ఈ సినిమాకు 46 ఇంటర్నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ వచ్చాయి. తాజాగా ప్రముఖ దర్శకుడు హను రాఘవపూడి (Hanu Raghavapudi) టీజర్ ని లాంచ్ చేశారు. ఓ కబడ్డీ ఆటగాడి నిజజీవితాన్ని ఆధారంగా తీసుకొని రూపొందిన ఈ మూవీ టీజర్ ప్రేక్షకులని కట్టిపడేసేలా ఉంది. సినిమాని బిగ్ స్క్రీన్‌పై చూడాలనే క్యురియాసిటీని టీజర్ మరింతగా పెంచింది.
టీజర్ లాంచ్ ఈవెంట్ లో డైరెక్టర్ విక్రాంత్ రుద్ర మాట్లాడుతూ, 'ఒక తల్లి బిడ్డకు జన్మనివ్వడానికి 9 నెలలు మోస్తుంది. నేను కూడా ఈ సినిమాని మీకు చూపించడానికి తొమ్మిదేళ్లుగా మోశాను. నేను 12 ఏళ్ల పిల్లాడిగా ఉన్నప్పుడు అర్జున్ చక్రవర్తి అనే వ్యక్తిని కలిశాను. ఆయన దగ్గరకు నేను కబడ్డీ ట్రైనింగ్ కోసం వెళ్ళినప్పుడు ఆయన ఒక కథ చెప్పారు. అది నా మనసులో బలంగా నాటు పోయింది. ఆ కథని ఎలాగైనా ప్రపంచానికి చెప్పాలి భావించను. అలా ఈ కథ నేను డైరెక్టర్ కావడానికి డ్రైవ్ చేసింది. నిర్మాత శ్రీని గారికి కథ చెప్పిన తర్వాత ఆయనకి నచ్చింది. మేం అనుకున్న బడ్జెట్ కంటే ఎక్కువైంది. అయినప్పటికీ ఆయన ఎక్కడ కూడా రాజీ పడకుండా ప్రాజెక్టుకు కావలసిన ప్రతిదీ సమకూర్చారు. ఈ సినిమాని 120 లొకేషన్స్ లో షూట్ చేశాం. మా హీరో విజయ్ ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డారు. ఎలాంటి ఫిజికల్ ట్రాన్స్ఫర్మేషన్ కావాలన్నా అది చేసి చూపించారు. మైనస్ డిగ్రీల్లో షూట్ చేసాం. సినిమాలో మ్యూజిక్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్ లో ఉంటుంది. మా హీరోయిన్ సిజ్జా రోజ్ చాలా హార్డ్ వర్క్ చేసింది. సినిమా కోసం తెలుగు కూడా నేర్చుకుంది. ఈ సినిమా తప్పకుండా అందరినీ అలరిస్తుంది' అని అన్నారు.
హీరో విజయరామరాజు మాట్లాడుతూ, 'నేను ఏడాదిన్నర పాటు ప్రో కబడ్డీ టీమ్స్ తో ట్రావెల్ అయ్యి రియల్ గా గేమ్ నేర్చుకుని ఈ సినిమా చేశాను. బాడీ ట్రాన్స్ఫర్మేషన్ కోసం సిక్స్ ప్యాక్ చేయాల్సి వచ్చింది. ఇదంతా మా డైరెక్టర్, మా నిర్మాత సపోర్ట్ తోనే సాధ్యమైయింది. నా జీవితంలో గుర్తుండిపోయే సినిమా ఇది. ఇంత మంచి క్యారెక్టర్ ఉన్న సినిమా రావడం చాలా అరుదు. ఈ సినిమాలో నేను ఏదైనా పర్ఫామెన్స్ చేశానంటే అది మా డైరెక్టర్ గారి వల్లే. ఆయన అద్భుతంగా మలుచుకున్నారు. నిరంతరం సినిమా కోసమే తపించారు. ఈ సినిమా క్రెడిట్ అంతా ఆయనకే దక్కుతుంది' అని అన్నారు. నిర్మాత శ్రీని గుబ్బల మాట్లాడుతూ, 'కథ బాగా నచ్చడంతో ప్రొడక్షన్ లో ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా సినిమాని చేయడం జరిగింది. హీరో విజయ్ ట్రాన్స్ఫర్మేషన్ అయ్యారు. ఆయన హార్డ్ వర్క్ టీజర్ లో మీరందరూ చూస్తారు. ఈ సినిమాకి మీరంతా సపోర్ట్ చేయాలని కోరుతున్నాను' అని చెప్పారు. ఈ కార్యక్రమంలో హీరోయిన్ సిజ్జా రోజ్, యాక్టర్ దుర్గేష్, మ్యూజిక్ డైరెక్టర్ విఘ్నేష్ భాస్కరన్, డీఓపీ జగదీశ్ కూడా పాల్గొన్నారు.
Also Read: Actress Ramya: నిన్ను అత్యాచారం చేసి చంపేస్తాం.. హీరో ఫ్యాన్స్ బెదిరింపులు
Also Read: Chaurya Paatham: మనీ హైస్ట్ ను తలపించే చోరీ.. ట్విస్టులకు దిమ్మ తిరగాల్సిందే