Actress Ramya: నిన్ను అత్యాచారం చేసి చంపేస్తాం.. హీరో ఫ్యాన్స్ బెదిరింపులు
ABN , Publish Date - Jul 28 , 2025 | 05:13 PM
కోలీవుడ్ నటి దివ్య స్పందన అలియాస్ రమ్య (Ramya) గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
Actress Ramya: కోలీవుడ్ నటి దివ్య స్పందన అలియాస్ రమ్య (Ramya) గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగులో కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన అభి సినిమాలో హీరోయిన్ గా నటించి మెప్పించింది. ఆ తరువాత సూర్య సన్నాఫ్ కృష్ణన్ సినిమాతో రమ్య మరింత గుర్తింపు తెచ్చుకుంది. ఇక సినిమాల కంటే ఎక్కువ వివాదాల ద్వారా పేరు తెచ్చుకుంది రమ్య. ఇక ఈ మధ్యనే ఆమె కన్నడ నటుడు దర్శన్ (Darshan) వివాదంలో తలదూర్చింది.
ప్రియురాలిపై మోజుతో దర్శన్.. అభిమాని అయినా రేణుకా స్వామిని హత్య చేసిన విషయం తెల్సిందే. ఆ కేసు నేపథ్యంలోనే దర్శన్ జైలుకు కూడా వెళ్ళాడు. ఇక ఈ హత్య వలన దర్శన్ పై చాలా ట్రోలింగ్ జరిగింది. రమ్య కూడా సోషల్ మీడియా వేదికగా దర్శన్ పై నోరుపారేసుకుంది. లక్షలాది మంది అభిమానులను సంపాదించుకున్న దర్శన్ సరిదిద్దుకోలేని తప్పు చేశాడని, ప్రియురాలి కోసం ఒక నిండు ప్రాణాన్ని ఎలా తీయగలిగాడు అంటూ ఫైర్ అయ్యింది. ఇది పద్దతి కాదని, దర్శన్ కు శిక్ష పడాలని కోరింది.
ఇక రమ్య వ్యాఖ్యలపై దర్శన్ అభిమానులు ఫైర్ అయ్యారు. తమ హీరోనే విమర్శిస్తుందా అని మండిపడుతూ అసభ్యమైన పదజాలంతో రమ్యపై ట్రోలింగ్ చేయడం మొదలుపెట్టారు. ఈమధ్య ఇంకా రెచ్చిపోయి అత్యాచారం చేసి చంపేస్తామని కాల్స్ చేసి బెదిరిస్తున్నారని రమ్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. దర్శన్ అభిమానులు తనను బెదిరిస్తున్నారని, వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె కమిషనర్ ను కలిసి డిమాండ్ చేయనుంది. రేణుకా స్వామి బదులు నిన్ను హత్య చేయాల్సింది.. మా హీరోనే అంటావా.. అంటూ సోషల్ మీడియాలో తనకు హత్యా బెదిరింపులు వస్తున్నాయని, సోషల్ మీడియా వచ్చాకా ఇలాంటివి పెరిగిపోయాయని ఆమె చెప్పుకొచ్చింది.