Chaurya Paatham: మనీ హైస్ట్ ను తలపించే చోరీ.. ట్విస్టులకు దిమ్మ తిరగాల్సిందే
ABN , Publish Date - Jul 28 , 2025 | 06:11 PM
జనరేషన్ మారేకొద్దీ ప్రేక్షకుల అభిరుచి కూడా మారుతూ వస్తుంది. ఒకప్పుడు స్టార్ హీరోల సినిమాలు అంటే కథతో సంబంధం ఉండేది కాదు.
Chaurya Paatham: జనరేషన్ మారేకొద్దీ ప్రేక్షకుల అభిరుచి కూడా మారుతూ వస్తుంది. ఒకప్పుడు స్టార్ హీరోల సినిమాలు అంటే కథతో సంబంధం ఉండేది కాదు. కానీ, . కాదు చిన్న సినిమా.. పెద్ద సినిమా అనే తేడా లేకుండా కథ నచ్చితే చాలా సినిమాను హిట్ చేస్తున్నారు. ముఖ్యంగా థియేటర్ లో కంటే ఓటీటీలో మరిన్ని చిన్న చిన్న సినిమాలు రికార్డులు సృష్టిస్తున్నాయి. ఇంద్ర రామ్, పాయల్ రాధాకృష్ణ జంటగా నిఖిల్ గొల్లమారి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం చౌర్య పాఠం(Chaurya Paatham). నక్కిన నేరేటివ్స్ బ్యానర్‌పై త్రినాధరావు నక్కిన నిర్మించిన ఈ సినిమా ఏప్రిల్ 25 న రిలీజ్ అయ్యి పాజిటివ్ టాక్ నే అందుకుంది.
ఇక ఈమధ్యనే ఓటీటీలో రిలీజ్ అయిన చౌర్య పాఠం ఇక్కడ కూడా మంచి పాజిటివ్ టాక్ ను అందుకొని దూసుకుపోతుంది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సినిమా తాజాగా రేర్ రికార్డ్ ను సృష్టించింది.అమెజాన్ ప్రైమ్ లో 200 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్ వ్యూస్ రాబట్టి చిన్న సినిమాలలో పెద్ద విజయం సాధించింది. ఇక ఇంద్ర రామ్ తదుపరి సినిమాపై కూడా అంచనాలను పెంచేలా చేసింది. ఒక క్రైమ్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమాలోని ట్విస్టులకు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు.
బ్యాంక్ దొంగతనం అనగానే మనీ హైస్ట్ సిరీస్ గుర్తుకొస్తుంది. ఇక చౌర్య పాఠం టాలీవుడ్ మనీ హైస్ట్ అని చెప్పుకొస్తున్నారు. ఆ సిరీస్ తరహాలో బ్యాంక్ చోరీ, దానికి తగ్గ ప్లాన్.. సినిమా ఆ చూస్తున్నంత సేపు టాలీవుడ్ మనీ హైస్ట్ చూస్తున్నట్లు ఉంటుందని చెప్పొచ్చు. అసలు ఈ సినిమా కథ విషయానికొస్తే.. వేదాంత్ రామ్ (ఇంద్ర రామ్) ఒక అసిస్టెంట్ డైరెక్టర్. అతడికి ఎప్పడికైనా డైరెక్టర్ అవ్వాలనేది కోరిక. ఎక్కడికి వెళ్లినా అతడికి డైరెక్టర్ ఛాన్స్ రాదు. దీంతో తన సొంత డబ్బుతోనే సినిమా తెరకెక్కించాలనుకుంటాడు.
ఇక సినిమా తీయడానికి కావాల్సిన డబ్బు కోసం వేదాంత్ రామ్.. అతడి ఫ్రెండ్ లక్ష్మణ్ తో కలిసి ఒక బ్యాంక్ చోరీ చేయాలనీ ప్లాన్ చేస్తాడు. ధనపాలే గ్రామంలో డబ్బులు ఎక్కువ ఉండే బ్యాంక్ లో చోరీ చేయాలనీ ప్లాన్ చేసి.. అక్కడకు వెళ్తారు. ఎవరికీ తెలియకుండా వారు ఉండే ప్లేస్ నుంచి బ్యాంక్ వరకు సొరంగం తవ్వుతారు. అయితే ఆ సొరంగం.. బ్యాంక్ లోపలికి పోకుండా సర్పంచ్ ఇంటి లోపలకు తీసుకెళ్తుంది. అక్కడ వారికి అనుకోని సంఘటనలు ఎదురవుతాయి. పైకి దేవతలా కనిపించే సర్పంచ్ వెనుక ఉన్న కుట్ర ఏంటి.. ? చివరకు ఈ గ్యాంగ్ బ్యాంక్ చోరీ చేశారా.. ? వేదాంత్.. సర్పంచ్ ఆట కట్టించాడా.. ? అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.
కామెడీతో పాటు క్రైమ్ కూడా చాలా బాగా చూపించారు. కథ కొద్దిగా రొటీన్ గా అనిపించినా కొంతవరకు ప్రేక్షకులను కామెడీతో లాకొచ్చేస్తుంది. ఓటీటీలో చూసేవారికి చౌర్యపాఠం పర్ఫెక్ట్ ఛాయిస్ అని చెప్పొచ్చు. మరి ఈ సినిమా ముందు ముందు ఎలాంటి రికార్డులను సృష్టిస్తుందో చూడాలి.
AM Rathnam Vs Ambati: అంబటి రాంబాబుకు.. ఏఎం రత్నం అదిరిపోయే కౌంటర్
Actress Ramya: నిన్ను అత్యాచారం చేసి చంపేస్తాం.. హీరో ఫ్యాన్స్ బెదిరింపులు