Dhanunjay: సందేశాత్మకంగా 'ఉతుకు పిండు ఆరెయ్' గీతం
ABN, Publish Date - Aug 18 , 2025 | 08:23 PM
విశాఖ వాసి టి. ధనంజయ్, నిహారిక నటించిన వీడియో సాంగ్ 'ఉతుకు పిండు ఆరెయ్' ఆవిష్కరణ ఇటీవల వైజాగ్ లో జరిగింది.
ధనుంజయ్, నిహారిక లీడ్ రోల్ పోషించిన 'ఉతుకు పిండు ఆరెయ్' (Uthuku Pindu Arey) వీడియో సాంగ్ ను ఇటీవల మద్దెలపాలెం కళాభారతిలో విశాఖ దక్షిణ నియోజకవర్గం శాసనసభ్యులు వంశీకృష్ణ శ్రీనివాస్ (Vamsy Krishna Srinivas), 'లీడర్' రమణమూర్తి (Leader Ramanamurthy), దాడి సత్యనారాయణ (Dadi Satyanarayana) ఆవిష్కరించారు. రెడ్డెం యాద కుమార్ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ వీడియో సాంగ్ ను పల్సర్ బైక్ రమణ, అమిత ఆలపించారు. దీనికి నిస్సీ జస్టిన్ స్వరాలు సమకూర్చారు. ఉదయ్ కుమార్ సినిమాటోగ్రఫీ అందించగా, పి. శ్యామ్ ఎడిటింగ్ చేశారు. ఈ పాటకు దినేశ్ నృత్యరీతులు సమకూర్చారు. ఈ పాటలో దాదాపు 300 మంది కళాకారులు స్వచ్ఛందంగా పాల్గొనడం విశేషం.
వీడియో సాంగ్ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న ప్రముఖులంతా సమాజ హితాన్ని కాంక్షింస్తూ సాగిన ఈ పాటను, దాని మేకింగ్ ను మెచ్చుకున్నారు. ఈ వీడియో సాంగ్ నిర్మాత టి. ధనుంజయ్ ను అభినందించారు. రికార్డు స్థాయిలో పెద్ద ఎత్తున కళాకారులు పాల్గొన్న ఈ పాట తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటు సంపాదించుకుంది. రమణ రేలా ఆన్లైన్ యూ ట్యూబ్ ఛానెల్ వేదికగా రిలీజ్ అయిన ఈ పాట తెలుగువారిని ఆకట్టుకుంటోంది. ఈ సందర్భంగా టి. ధనుంజయ్ మాట్లాడుతూ, 'ఈ పాట రూపకల్పనకు సహకరించిన యాద కుమార్, పల్సర్ రమణ, అమిత తదితరులకు, విశాఖ వాసులకు ధన్యవాదాలు తెలిపారు. ఈ పాటను వీలైనంత మంది చూసి ఆదరిస్తే, ఈ తరహాలోనే మరిన్ని వీడియో సాంగ్స్ ను వెలువరిస్తామని చెప్పారు.
Also Read: Shootings Bandh: చిరంజీవితో సినీ కార్మికుల మిలాఖత్
Also Read: Rukmini Vasanth: రుక్మిణిని వరిస్తున్న బిగ్ ప్రాజెక్ట్స్