Kannappa: ‘కన్నప్ప’ కామిక్ బుక్ .. మూడో ఎపిసోడ్ రిలీజ్
ABN, Publish Date - May 16 , 2025 | 02:25 PM
మంచు విష్ణు (Manchu Vishnu) హీరోగా అయన డ్రీమ్ ప్రాజెక్ట్‌గా రూపొందుతోన్న చిత్రం ‘కన్నప్ప’ (Kannappa). ముకేశ్ కుమార్‌సింగ్ దర్శకత్వం వహించారు. ప్రీతి ముకుందన్ కథానాయిక. ఇప్పటికే చిత్రీకరణ పనులు పూర్తిచేసుకున్న ఈ మూవీ జూన్ 27న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ప్రస్తుతం ప్రమోషన్స్ స్పీడప్ చేశారు. కన్నప్ప కామిక్ బుక్ అంటూ యానిమేటెడ్ సిరీస్ వీడియోలను షేర్ చేస్తోంది. తాజాగా దీని మూడో ఎపిసోడ్‌ను మేకర్స్ షేర్ చేశారు.