Kannappa: విడుదలైన శ్రీ కాళ హస్తి గీతం

ABN , Publish Date - May 28 , 2025 | 04:03 PM

'కన్నప్ప' సినిమా కోసం మంచు విష్ణు కుమార్తెలు అరియానా, వివియానా 'శ్రీ కాళ హస్తి' అనే గీతాన్ని పాడారు. ఈ పాటను వారిపైనే చిత్రీకరించారు.

గత కొద్దిరోజులుగా వివాదాలతో సాగుతున్న 'కన్నప్ప' (Kannappa) ప్రయాణం... మళ్ళీ ప్రచారపర్వం వైపు మళ్ళింది. విష్ణు మంచు (Vishnu Manchu) డ్రీమ్ ప్రాజెక్ట్ ‘కన్నప్ప’ జూన్ 28న విడుదల చేయబోతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ప్రమోషన్స్‌లో విష్ణు మంచు కొత్త ఒరవడిని సృష్టిస్తున్నారు. ఆల్రెడీ యు.ఎస్‌.లో ‘కన్నప్ప’ టూర్‌ని ముగించుకుని వచ్చారు. తాజాగా మోహన్ బాబు (Mohan Babu) మనవరాళ్లు, విష్ణు కూతుళ్లు అరియానా, వివియానా పాడిన ‘శ్రీకాళ హస్తి’ పాటను విడుదల చేశారు. ఇప్పటి వరకు ఈ చిత్రం నుంచి వచ్చిన ప్రతీ పాట పాజిటివ్ వైబ్స్‌ను క్రియేట్ చేస్తోంది.


అరియానా (Ariaana), వివియానా (Viviana) పాడిన ఈ ప్రత్యేకమైన పాటను మే 28న కాశీ విశ్వనాథ ఆలయంలో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో నిర్మాత మోహన్ బాబు, దర్శకుడు ముఖేష్ కుమార్ సింగ్ (Mukesh Kumar Singh), రచయితలు తోట ప్రసాద్, ఆకుల శివ, అర్పిత్ రాంకా తదితరులు పాల్గొన్నారు. స్టీఫెన్ దేవస్సీ స్వరపరిచిన ఈ పాట భక్తి, భావోద్వేగాలను ప్రతిబింబించేలా ఉంది. సుద్దాల అశోక్ తేజ (Suddala Ashok Teja) రాసిన ఈ సాహిత్యం శ్రీ కాళ హస్తి దైవిక వారసత్వాన్ని అందంగా వివరిస్తోంది. విష్ణు మంచు కుమార్తెలు అరియానా, వివియానా ఈ పాటను ప్రతీ ఒక్కరి హృదయాల్ని తాకేలా ఆలపించారు. ఈ లిరికల్ వీడియోలో అరియానా, వివియానా కనిపించిన విజువల్స్ అందరినీ ఆకట్టుకునేలా ఉన్నాయి. సుందరమైన ప్రదేశాలలో చిత్రీకరించిన ఓ విజువల్ వండర్‌గా అందరినీ మెప్పించనుంది.

Also Read: Thug Life: కమల్ హాసన్ పై కన్నడిగుల కినుక

Also Read: Sandeep Reddy Vanga: వివాదంపై దీపిక పరోక్ష వ్యాఖ్యలు

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

Updated Date - May 28 , 2025 | 04:08 PM