Sandeep Reddy Vanga: వివాదంపై దీపిక పరోక్ష వ్యాఖ్యలు

ABN , Publish Date - May 28 , 2025 | 02:12 PM

దీపికా పదుకోణె 'స్పిరిట్' వివాదంపై పరోక్షంగా స్పందించింది. ఇలాంటి సమయాలలో తాను మనసు మాట వింటానని, తద్వారా సంయమనం పాటిస్తానని తెలిపింది.

గడిచిన రెండు మూడు రోజులుగా సోషల్ మీడియా దీపికా పదుకోణె (Deepika Padukone) వర్సెస్ సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) అన్నట్టుగా సాగుతోంది. 'స్పిరిట్' (Spirit) చిత్రం నుండి దీపికా పదుకోణె తొలగిన తర్వాత ఆ స్థానంలో త్రిప్తి డిమ్రీ (Tripti Dimri) ని సందీప్ రెడ్డి వంగా ఎంపిక చేసుకున్నాడు. అతని గత చిత్రం 'యానిమల్' (Animal) లో త్రిప్తి డిమ్రీ నటించింది. అయితే ఆమె ఈ ప్రాజెక్ట్ లోకి వచ్చిన తర్వాత దీపికా పదుకోణె పీఆర్ టీమ్ సందీప్ రెడ్డి వంగాను టార్గెట్ చేస్తూ విమర్శించడం, సినిమాలోని కొన్ని అంశాలను లీక్ చేయడం మొదలు పెట్టాయి. దాంతో ఆగ్రహించిన సందీప్ గట్టిగా వాళ్ళకు కౌంటర్ ఇచ్చాడు. దీపికా పదుకోణె పేరు డైరెక్ట్ గా ప్రస్తావించకుండానే ఓ స్టార్ హీరోయిన్ కు తాను కథ చెప్పిన తర్వాత ఇలా జరిగిందంటూ వ్యాఖ్యలు చేశాడు. ఇదేనా మీ ఫెమినిజం అంటూ ఇన్ డైరెక్ట్ గా ఆమెను ప్రశ్నించాడు. అయితే... దీపికా పదుకోణె సైతం డైరెక్ట్ గా సందీప్ రెడ్డి వంగా పేరును, స్పిరిట్ మూవీ నుండి తప్పుకోవడాన్ని మెన్షన్ చేయకుండా ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తన వైఖరిని తెలిపింది. సినిమా రంగంలో తనకు ఏదైనా ఇబ్బంది కరమైన పరిస్థితి ఉత్పన్నమైతే... ఇన్నర్ వాయిస్ మాట వింటానని తెలిపింది. ఏ విషయంలో అయినా బాలెన్స్ గా, అన్ బయాస్డ్ గా ఉండాలనుకున్నప్పుడు అంతరాత్మ ప్రభోదం మేరకు తాను నడుచుకుంటానని, అప్పుడే తాను ఆ సిట్యుయేషన్ కు సరైన న్యాయం చేయగలన'ని తెలిపింది. సో... 'స్పిరిట్' సినిమా విషయంలో తనవైపు నుండీ ఎలాంటి లీక్స్ జరగలేదని ఆమె ఖండిచలేదు సరికదా... సందీప్ రెడ్డి వంగా తన పీఆర్ టీమ్ పై చేసిన వ్యాఖ్యలను కూడా ఆమె డైరెక్ట్ గా ప్రస్తావించడానికి ఇష్టపడలేదు. దీపిక వైఖరి కప్పదాటు వ్యవహారంగా ఉందని కొందరు విమర్శిస్తుంటే... ఆమె చర్యలను మరికొందరు తీవ్రంగా విమర్శిస్తున్నారు.


ఇదిలా ఉంటే... ఇటీవల హైదరాబాద్ లో జరిగిన 'ప్రేమకి ప్రాణం ఉంటే' అనే నవల ఆవిష్కరణలో సందీప్ రెడ్డి వంగా పాల్గొన్నాడు. ఇదే కార్యక్రమంలో పాల్గొన్న ఇతర దర్శకుడు సాయి రాజేశ్‌ (Sai Rajesh), శివ నిర్వాణ (Siva Niravana), మెహర్ రమేశ్ (Mehar Ramesh) తదితరులంతా సందీప్ ను పొగడ్తలతో ముంచెత్తారు. ముంబైలో సందీప్ రెడ్డి మానసిక ప్రశాంతత కరువైంది, హైదరాబాద్ కు వచ్చిన తర్వాత చాలా కార్యక్రమాలలో అతను పాల్గొంటున్నాడని, తన అవసరం ఉందని ఎవరు భావించినా వారికి అండగా నిలుస్తున్నాడని దర్శకుడు శివ నిర్వాణ అన్నాడు. అలానే మెహర్ రమేశ్‌ మాట్లాడుతూ, భారతీయ సినిమాపై సందీప్ రెడ్డి తనదైన ముద్ర వేశాడని తెలిపారు. సందీప్ రెడ్డిలో ప్రేమ రాయబారి, ప్రేమ తిరుగుబాటు దారుడు ఇద్దరూ ఉన్నారని అన్నారు. సందీప్ రెడ్డి వంగాలో మంచి మ్యూజిక్ సెన్స్ ఉందని, 'స్పిరిట్' నుండి కూడా అలాంటి సంగీతాన్ని ఆశిస్తున్నామని మెహర్ రమేశ్‌ తెలిపాడు. మొత్తానికి బాలీవుడ్ వివాదాలకు కాస్తంత విశ్రాంతి చెప్పి... సందీప్ రెడ్డి వంగా హైదరాబాద్ లో ప్రశాంత వాతావరణంలో మిత్రులతో గడుపుతున్నట్టుగా ఉంది.

Also Read: Tourist Family OTT: ఓటీటీకి టూరిస్ట్ ఫ్యామిలీ.. క‌డుపుబ్బా న‌వ్విస్తారు.. ఏడిపిస్తారు! ఎప్ప‌టినుంచంటే...

Also Read: OTT Movies: మే చివ‌రి వారం.. ఓటీటీలో సినిమాల జాత‌రే జాత‌ర‌

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

Updated Date - May 28 , 2025 | 02:12 PM