Raju Weds Rambai: ఆకట్టుకుంటున్న 'రాజు వెడ్స్ రాంబాయి' ట్రైలర్
ABN, Publish Date - Nov 13 , 2025 | 03:17 PM
అఖిల్ ఉడ్డేమారి, తేజస్వినీ రావ్ జంటగా నటించిన సినిమా 'రాజు వెడ్స్ రాంబాయి'. ఈటీవీ విన్ ఒరిజినల్స్ తో కలిసి దర్శకుడు వేణు ఊడుగుల, రాహుల్ మోపిదేవి ఈ సినిమాను నిర్మించారు. ఈ మూవీతో సాయిలు కంపాటి దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. తెలంగాణ గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాకు యదార్థ సంఘటనలు ఆధారమని మేకర్స్ చెబుతున్నారు. గ్రామంలో డప్పు కొట్టే హీరోతో అదే గ్రామానికి చెందిన అమ్మాయి ప్రేమలో పడిన తర్వాత ఎలాంటి పరిస్థితులను ఈ ప్రేమికులు ఎదుర్కొన్నారన్నదే ఈ చిత్రకథ. ఈ నెల 21న జనం ముందుకు రాబోతున్న 'రాజు వెడ్స్ రాంబాయి' ట్రైలర్ ను మేకర్స్ గురువారం విడుదల చేశారు.