Narne Nithin: విడుదలైన శ్రీశ్రీశ్రీ రాజావారు ట్రైలర్
ABN , Publish Date - May 31 , 2025 | 05:17 PM
ఎన్టీఆర్ బావమరిది నార్నే నితిన్ నటించిన తొలి చిత్రం 'శ్రీశ్రీశ్రీ రాజావారు'. ఈ మూవీ జూన్ 6న జనం ముందుకు రాబోతోంది.
ఎన్టీఆర్ (NTR) బావమరిది నార్నే నితిన్ (Narne Nithin) హీరోగా నటించిన తొలి చిత్రం 'శ్రీ శ్రీ శ్రీ రాజావారు' (Sri Sri Sri Rajavaru). అయితే దీనికంటే ముందు 'మ్యాడ్ (Mad), ఆయ్ (Aay), మ్యాడ్ స్క్వేర్' (Mad Square)' చిత్రాలు విడుదలయ్యాయి. అలానే ఇటీవల వచ్చిన '#సింగిల్' మూవీలోనూ నార్నే నితిన్ గెస్ట్ అప్పీయరెన్స్ ఇచ్చాడు. ఈ సినిమా కూడా మంచి విజయాన్నే అందుకుంది. ఈ నేపథ్యంలో నార్నే నితిన్ హీరోగా, 'శతమానం భవతి' ఫేమ్ వేగేశ్న సతీశ్ (Sateesh Vegesna) తెరకెక్కించిన 'శ్రీశ్రీశ్రీ రాజావారు' మూవీని నిర్మాత చింతపల్లి రామారావు జూన్ 6న విడుదల చేయబోతున్నారు. విశేషం ఏమంటే... ఇదే రోజున 'మ్యాడ్, మ్యాడ్ స్క్వేర్' ఫేమ్ సంగీత్ శోభన్ నటించిన 'గ్యాంబ్లర్స్' కూడా రిలీజ్ కాబోతోంది.
'శ్రీశ్రీశ్రీ రాజావారు' సినిమాలో సంపద (Sampada) హీరోయిన్ గా నటించింది. అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్న ఈ యూత్ ఫుల్ యాక్షన్ ఎంటర్ ఎంటర్ టైనర్ ట్రైలర్ ను హైదరాబాద్ లో విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో సతీశ్ వేగేశ్న, చింతపల్లి రామారావు, కో-ప్రొడ్యూసర్ సుబ్బారెడ్డి, దర్శక నిర్మాత రాజేశ్ పుత్ర, రఘు కుంచే, రచ్చ రవి, సంగీత దర్శకుడు కైలాష మీనన్ తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా సతీష్ వేగేశ్న మాట్లాడుతూ, 'మా సినిమా సాంగ్స్, ట్రైలర్ ను సక్సెస్ చేసిన అందరికీ థ్యాంక్స్. ఈ సినిమాలో నరేష్ గారు ఒక డైలాగ్ చెబుతారు. మనల్ని మనం జయించుకోవడమే సక్సెస్ అంటే అని. ఈ కాన్సెప్ట్ తో సినిమాను రూపొందించాం. మా హీరో నార్నే నితిన్ పక్కింటి కుర్రాడిలా మొదలుపెట్టి, యాక్షన్ పరంగా ఆకట్టుకుంటూ అద్భుతంగా పర్ ఫార్మ్ చేశాడు. హీరోయిన్ సంపద మిమ్మల్ని ఆకట్టుకుంటుంది. నా సినిమాల్లో ఎక్కువమంది ఆర్టిస్టులు ఉంటారు. కారణం మన కుటుంబాల్లో ఎలా ఎక్కువమంది బంధువులు ఉండేవారే. నా కథల్లోనూ అలాంటి పాత్రలే పలకరిస్తాయి. మరుగున పడిన కొన్నింటిని చూపించాలనే నా మూవీస్ ద్వారా తాపత్రయ పడుతుంటాను. అలాంటి ప్రయత్నమే ఈ సినిమా కూడా. ఇది మిమ్మల్ని నిరాశ పర్చదు' అని అన్నారు.
నిర్మాత చింతపల్లి రామారావు మాట్లాడుతూ, 'ఒక మంచి కమర్షియల్ ఎలిమెంట్స్ తో బిగ్ హిట్ మూవీని నిర్మించాలని నార్నె నితిన్, వేగేశ్న సతీష్ కాంబినేషన్లో ఈ చిత్రాన్ని రూపొందించాం. మా చిత్ర హీరో నార్నె నితిన్ ఇటీవల మంచి యూత్ ఫుల్ ఎంటర్టైనర్ మూవీస్ తో వరుస విజయాలు అందుకుంటున్నారు. ఇది వాటికి భిన్నంగా గ్రామీణ నేపథ్యంలో సాగే వెరైటీ ఫ్యామిలీ ఎంటర్టైనర్. యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఎంతో మెచ్చి, ఈ కథను ఎంపిక చేశారు. ఆయన అంచనాల మేరకు దర్శకుడు ఈ చిత్రాన్ని ఎక్కడా రాజీ పడకుండా తెరకెక్కించారు. కచ్చితంగా ఈ జూన్ 6న నార్నె నితిన్ ఖాతాలో ఆయ్ , మ్యాడ్ సీరిస్ తరహాలో మరో సూపర్ హిట్ హిట్ పడుతుందని గట్టిగా నమ్ముతున్నాం' అని అన్నారు.
Also Read: Sekhar Kammula: ఆయనతో సినిమా తీయాలనే ఫీలింగ్ అంతే...
Also Read: Kankhajura web series : కంఖాజుర వెబ్ సీరిస్ రివ్యూ
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి