సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Vrusshabha: దీపావళికి వారియర్ కింగ్ గా మోహన్ లాల్

ABN, Publish Date - Sep 18 , 2025 | 06:43 PM

దీపావళి కానుకగా మోహన్ లాల్ 'వృషభ' చిత్రం నాలుగు భాషల్లో విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా తాజాగా ఈ మూవీ టీజర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు.

Vrusshabha teaser poster

మలయాళ చిత్రసీమ సైతం ఇవాళ అందరూ తమ వైపు దృష్టి సారించేలా చేస్తోంది. కంటెంట్ బేస్డ్ మూవీస్ మాత్రమే కాకుండా కొంతకాలంగా భారీ యాక్షన్ పాన్ ఇండియా మూవీస్ సైతం మలయాళం నుండి వస్తున్నాయి. ఆ కోవకు చెందిన మరో చిత్రం మోహన్ లాల్ నటించిన 'వృషభ'. హిస్టారికల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాను నందకిశోర్ డైరెక్ట్ చేశారు. సెప్టెంబర్ 18న ఈ సినిమా టీజర్ ను విడుదల చేశారు.


మైథాలజీ ఎలిమెంట్స్ తో పాటు ఇందులో యాక్షన్, డ్రామా, సస్పెన్స్ సమపాళ్ళలో ఉన్నాయనేది ఈ టీజర్ చూస్తే అర్థమౌతోంది. అలానే వి.ఎఫ్.ఎక్స్.కు అధిక ప్రాధాన్యం ఇచ్చారు. దానికి తగ్గట్టుగానే క్వాలిటీతో ఉన్నాయి. ఓ వారియర్ కింగ్ గానే కాకుండా ప్రస్తుతం కూడా మోహన్ లాల్ కనిపించడంతో ఇది సోషియో ఫాంటసీ మూవీ అని అనిపిస్తోంది. ఇందులో తండ్రీకొడుకుల అనుబంధాన్ని ఒకే ఒక్క షాట్ లో నందకిశోర్ చక్కగా చూపించారు. ఈ దీపావళి కానుకగా రాబోతున్న 'వృషభ'లో మోహన్ లాల్ నట విశ్వరూపం చూపబోతున్నాడని తెలుస్తోంది.

కనెక్ట్ మీడియా, బాలాజీ టెలిఫిలిమ్స్‌తో క‌లిసి అభిషేక్ వ్యాస్ స్టూడియోస్ 'వృష‌భ' సినిమాను నిర్మిస్తోంది. శోభా కపూర్, ఏక్తా ఆర్ కపూర్, సికె పద్మ కుమార్, వరుణ్ మాథుర్, సౌరభ్ మిశ్రా, అభిషేక్ ఎస్ వ్యాస్, విశాల్ గుర్నానీ, జూహీ పరేఖ్ మెహతా వంటి దిగ్గజ నిర్మాత‌లు 'వృష‌భ' సినిమాలో భాగ‌మ‌య్యారు. పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమా దీపావళికి మలయాళ, తెలుగు, హిందీ, కన్నడ భాషల్లో విడుదల కానుంది.

Updated Date - Sep 18 , 2025 | 06:54 PM