Mass jathara: ఈలలు, చప్పట్లతో స్టెప్పులు వేయించేలా 'ఓలే ఓలే'
ABN, Publish Date - Aug 05 , 2025 | 04:17 PM
రవితేజ కథానాయకుడిగా నటిస్తున్న75వ చిత్రం 'మాస్ జాతర'. భాను భోగవరపు దర్శకత్వం వహిస్తున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. మంగళవారం ఈ చిత్రం నుంచి 'ఓలే ఓలే'ను అంటూ సాగే రెండో పాటను విడుదల చేసింది చిత్ర బృందం. రవితేజ తన వింటేజ్ స్టెప్పులతో అలరించారు. శ్రీలీల తన అసాధారణ నృత్య ప్రతిభతో మరోసారి కట్టిపడేశారు. భీమ్స్ సిసిరోలియో స్వరాలు అందించారు. భాస్కర్ యాదవ్ దాసరి సాహిత్యం అందించారు. రోహిణి సోరట్ తన గాత్రంతో పాటకు మరింత జోష్ తీసుకొచ్చారు థియేటర్లలో ప్రేక్షకుల చేత.. ఈలలు, చప్పట్లతో స్టెప్పులు వేయించేలా ఎంతో ఉత్సాహభరితంగా ఉంది.