సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Vijay Varma: విడుదలైన గుస్తాఖ్ ఇష్క్ టీజర్

ABN, Publish Date - Aug 26 , 2025 | 01:43 PM

విజయ్ వర్మ, ఫాతిమా సనా షేక్ జంటగా నటిస్తున్న సినిమా 'గుస్తాఖ్ ఇష్క్'. మనీష్ మల్హోత్రా నిర్మిస్తున్న ఈ సినిమా నుండి టీజర్ విడుదలైంది.

Gustaakh Ishq Movie

అంతర్జాతీయ ఖ్యాతి గడించిన ఫ్యాషన్ డిజైనర్ మనీష్‌ మల్హోత్రా (Manish Malhotra) నిర్మిస్తున్న మూడో సినిమా 'గుస్తాఖ్‌ ఇష్క్' (Gustaakh Ishq). 80 నాటి కాలానికి చెందిన ఈ ప్రేమకథా చిత్రంలో విజయ్ వర్మ (Vijay Varma), ఫాతిమా సనా షేక్ (Fatima Sana Shaikh) జంటగా నటించారు. ఈ యేడాది సనా షేక్ నటించిన మూడో సినిమా ఇది. ఇప్పటికే 'మెట్రో ఏ దినో', 'ఆప్ జైసా కోయీ' చిత్రాలు విడుదలయ్యాయి. మాధవన్ (Madhavan) సంస్కృతం లెక్చరర్ గా నటించిన 'ఆప్ జైనా కోయి' మూవీలో ఫాతిమా సనా షేక్ ఫ్రెంచ్ ఇన్ స్ట్రక్టర్ పాత్రను చేసింది. వినోదాల విందు అందించిన ఈ సినిమా తర్వాత సానా మరో కీలక భూమిక పోషించిన సినిమా 'గుస్తాఖ్ ఇష్క్'. నవంబర్ లో విడుదల కాబోతున్న ఈ సినిమాలో నసీరుద్దీన్ షా, షరీబ్ హష్మీ కీలకపాత్రలు పోషించారు. విభు పూరి దర్శకత్వం వహించారు. మొదట్లో ఈ సినిమాకు 'ఉల్ జలూల్ ఇష్క్' అనే పేరు పెట్టారు. ఆ తర్వాత దీన్ని 'గుస్తాఖ్‌ ఇష్క్'గా మార్చారు. తాజాగా ఈ సినిమా నుండి టీజర్ విడుదలైంది. ఈ సినిమాకు విశాల్ భరద్వాజ్ సంగీతం అందించారు.

Updated Date - Aug 26 , 2025 | 01:43 PM