Fatima Sana Shaik: దంగ‌ల్ బ్యూటీ.. అంత‌కు ముందే తెలుగులో హీరోయిన్‌గా చేసిందా?

ABN , Publish Date - May 28 , 2024 | 02:47 PM

అమీర్ ఖాన్ మెయిన్ లీడ్‌గా ఫాతిమా స‌నా షేక్‌, జైరా వాసిమ్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించిన చిత్రం దంగ‌ల్‌. అయితే ఫాతిమా అంత‌కు ముందే ఓ తెలుగు సినిమా చేసిన సంగ‌తి చాలామందికి తెలియ‌దు.

Fatima Sana Shaik: దంగ‌ల్ బ్యూటీ.. అంత‌కు ముందే తెలుగులో హీరోయిన్‌గా చేసిందా?
Fatima Sana Shaik

అమీర్ ఖాన్ మెయిన్ లీడ్‌గా ఫాతిమా స‌నా షేక్‌, జైరా వాసిమ్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించిన చిత్రం దంగ‌ల్‌. ఇందులో అమీర్‌ఖాన్ పెద్ద‌ కూతురిగా, రెజ్లింగ్ క్రీడాకారిణి గీతా పోగ‌ట్‌గా అద్భుతంగా న‌టించి మంచి పేరు ద‌క్కించుకుంది ఫాతిమా (Fatima Sana Shaik). ఆ స‌మ‌యంలో ఆమె పేరు దేశ‌మంతా బాగా మారుమ్రోగింది కూడా. అయితే ఫాతిమా స‌నా షేక్ అంత‌కు ముందే ఓ తెలుగు సినిమా చేసిన సంగ‌తి చాలామందికి తెలియ‌దు. పైగా ఆ తెలుగు సినిమాతోనే ఈ అమ్మ‌డు కెరీర్ స్టార్ట్ చేయ‌డం విశేషం. అయితే ఇప్పుడే ఆ విష‌యాలు తెలుసుకోండి.

sa.jpg

బాలీవుడ్‌లో 2014 వ‌ర‌కు బాల న‌టిగా, స‌హాయ న‌టిగా చేస్తూ వ‌చ్చిన ఫాతిమా స‌నా షేక్ (Fatima Sana Shaik) దాదాపు ఓ డ‌జ‌న్ చిత్రాల‌లో న‌టించినా అశించినంత‌గా గుర్తింపు ల‌భించ‌లేదు. ఈ క్ర‌మంలో 2015లో హీరో రంజిత్ స్వామి హీరోగా న‌ర‌సింహా రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన నువ్వు నేను ఒక‌ట‌వుదాం అనే చిత్రంలో క‌థానాయిక‌గా స‌నా శ‌ర్మ‌ పేరుతో తొలి సారి అవ‌కాశం ద‌క్కించుకుంది.

f3.jpg

ఈ నేప‌థ్యంలో సినిమాకు సంబంధించిన ప్ర‌మోష‌న్ల‌లో, ఈవెంట్లలో కూడా బాగానే సంద‌డి చేసింది. అయినా సినిమా విడుద‌లై ప్రేక్ష‌కుల‌ను మెప్పించ‌లేక పోయింది. ఇప్పుడు ఈ నువ్వు నేను ఒక‌ట‌వుదాం (Nuvvu Nenu Okkatavudam) అనే సినిమా యూట్యూబ్‌లో ప్రేక్ష‌కుల‌కు అందుబాటులో ఉంది.

f7.jpg


faa.jpg

త‌ర్వాత మ‌రో ఒక‌టి రెండు తెలుగు అవకాశాలు వచ్చినా అదే సమయంలో ఫాతిమాకు అమీర్‌ఖాన్ దంగ‌ల్ (Dangal) చిత్రంలో ఛాన్స్ రావ‌డం, కాల్షీట్లు ఇచ్చేయ‌డంతో మ‌ళ్లీ తెలుగు చిత్రాల వైపు చూడ‌లేదు.

f11.jpg

ఆపై దంగ‌ల్ సినిమా విడుద‌లై క‌నీవినీ ఎరుగ‌ని విజ‌యం సాధించ‌డంతో ఫాతిమా (Fatima Sana Shaik) బాలీవుడ్‌లో ఓవ‌ర్‌నైట్ స్టార్‌గా మారిపోయింది. త‌ర్వాత లూడో, థ‌గ్స్ ఆఫ్ హిందుస్తాన్ వంటి పెద్ద సినిమాల్లో న‌టిస్తూ బిజీ అయి.. ఇప్పుడు ఎవ‌రు అందుకోలేనంత ఎత్తుకు ఎదిగిపోయింది.

Updated Date - May 28 , 2024 | 02:48 PM