3 Roses -2: రాశీసింగ్ లోని మరో కోణం
ABN , Publish Date - May 08 , 2025 | 06:01 PM
'త్రీ రోజెస్' వెబ్ సీరిస్ సూపర్ హిట్ అయిన నేపథ్యంలో ఇప్పుడు సెకండ్ సీజన్ కు రాబోతోంది. ఈషా రెబ్బా, కుషిత కల్లపు గ్లింప్స్ ఇప్పటికే విడుదల కాగా తాజాగా రాశీ సింగ్ గ్లింప్స్ ను మేకర్స్ రిలీజ్ చేశారు.
ఈషా రెబ్బా (Eesha Rebba), హర్ష చెముడు (Harsha Chemudu), ప్రిన్స్ సిసిల్ (Prince Cecil), హేమ (Hema), సత్యం రాజేశ్ Satyam Rajesh, కుషిత కల్లపు (Koushita Kallapu) ప్రధాన పాత్రల్లో నటించిన వెబ్ సిరీస్ 'త్రీ రోజెస్'. దీనికి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. దాంతో ఇప్పుడు సీజన్ 2కు రంగం సిద్థమైంది. డైరెక్టర్ మారుతీ (Maruthi) షో రన్నర్ గా వ్యవహరిస్తున్న ఈ వెబ్ సీరిస్ కు రవి నంబూరి, సందీప్ బొల్ల రచన చేయగా, కిరణ్ కె కరవల్ల దర్శకత్వం వహించారు.
'త్రీ రోజెస్' తాజా సీజన్ లో నటిస్తున్న హీరోయిన్లు ఈషా రెబ్బా, కుషిత కల్లపు గ్లింప్స్ ఇప్పటికే విడుదలై సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. తాజాగా మరో రోజా... రాశీసింగ్ (Rashi Singh) గ్లింప్స్ ను విడుదల చేశారు. ఈ గ్లింప్స్ లో రాశీ సింగ్ క్యారెక్టర్ ను ట్రెడిషనల్ గా పరిచయం చేస్తూ, మోడరన్ గా టర్న్ అయిన ట్విస్ట్ చూపించారు. ఆమె ఎందుకు ట్రెడిషనల్ నుంచి మోడరన్ గా మారింది అనేది గ్లింప్స్ లో ఆసక్తి కలిగిస్తోంది. త్వరలోనే ఈ వెబ్ సిరీస్ ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది.