3 Roses Season-2: బోల్డ్ అండ్ గ్లామరస్ గా కుషిత కల్లపు గ్లింప్స్...

ABN, Publish Date - Apr 30 , 2025 | 01:05 PM

దర్శకుడు మారుతీ షో రన్నర్ గా వ్యవహరించిన 'త్రీ రోజెస్' వెబ్ సీరిస్ ఆహాలో మంచి ఆదరణకు నోచుకుంది. ఇప్పుడు సీజన్ 2 కూడా అందులో రాబోతోంది.

ఈషా రెబ్బా (Eesha Rebba), హర్ష చెముడు (Harsha Cheudu), ప్రిన్స్ సిసిల్ (Prince Cecil) హేమ, సత్యం రాజేశ్, కుషిత కల్లపు (Kushita Kallapu) ప్రధాన పాత్రల్లో నటించిన వెబ్ సిరీస్ 'త్రీ రోజెస్'. ఆహా ఓటీటీలో సూపర్ హిట్టయిన ఈ సిరీస్ కు ఇప్పుడు సీజన్ 2 రాబోతోంది. ఈ సిరీస్ ను మాస్ మూవీ మేకర్స్ బ్యానర్ పై ఎస్ కేఎన్ నిర్మిస్తున్నారు. డైరెక్టర్ మారుతి షో రన్నర్ గా వ్యవహరిస్తున్నారు. రవి నంబూరి, సందీప్ బొల్ల రచన చేయగా.. కిరణ్ కె కరవల్ల దర్శకత్వం వహించారు.


తాజాగా 'త్రీ రోజెస్' సీజన్ 2 నుంచి నటి కుషిత కల్లపు గ్లింప్స్ రిలీజ్ చేశారు. కుషిత కల్లపు క్యారెక్టర్ బోల్డ్, ఫియర్స్, గ్లామరస్ గా ఉండి ఆకట్టుకుంటోంది. 'త్రీ రోజెస్' సీజన్ 2 కు ఆమె క్యారెక్టర్ వన్ ఆఫ్ ది అట్రాక్షన్ కాబోతోంది. తెలుగు అమ్మాయిలను ఎంకరేజ్ చేస్తున్న ప్రొడ్యూసర్ ఎస్ కేఎన్ ఈ సిరీస్ లో కుషితకు కీలకమైన క్యారెక్టర్ ఇచ్చారు. కుషితకు సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉంది. 'త్రీ రోజెస్' సీజన్ 2 లో ఆమె క్యారెక్టర్ వైవిధ్యంగా ఉంటూ, యూత్ ను బాగా ఆకట్టుకునేలా వైరల్ కంటెంట్ తో ఉండనుంది. ఇప్పటికే ఈ వెబ్ సీరిస్ నుంచి రిలీజ్ చేసిన హీరోయిన్ ఈషా రెబ్బా గ్లింప్స్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది. త్వరలోనే త్రీ రోజెస్ సీజన్ 2 ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ కు రెడీ అవుతోంది.

Updated Date - Apr 30 , 2025 | 01:08 PM