Naga Shaurya: 'బ్యాడ్ బాయ్ కార్తీక్' నుండి ఫస్ట్ సింగిల్

ABN , Publish Date - Aug 08 , 2025 | 06:23 PM

నాగశౌర్య, విధి జంటగా నటించిన సినిమా 'బ్యాడ్ బాయ్ కార్తీక్'. హ్యారీస్ జైరాజ్ స్వరాలు సమకూర్చిన ఈ సినిమా నుండి ఫస్ట్ సింగిల్ వచ్చింది.

Bad boy Karthik Movie

యంగ్ హీరో హీరో నాగశౌర్య (Naga Shaurya) అప్ కమింగ్ అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ 'బ్యాడ్ బాయ్ కార్తీక్' (Bad Boy Karthik). ఈ మూవీకి రామ్ దేశినా (రమేష్) దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో నాగశౌర్య జోడిగా విధి (Vidhi) హీరోయిన్ గా నటిస్తోంది. శ్రీ వైష్ణవి ఫిల్మ్స్ బ్యానర్‌పై శ్రీనివాసరావు చింతలపూడి నిర్మిస్తున్నారు. నాగ శౌర్య క్యారెక్టర్ ఇంటెన్స్ నేచర్ ని ప్రజెంట్ చేసే ఈ సినిమా ఫస్ట్ లుక్ కి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా మేకర్స్ ఈ సినిమా నుండి ఫస్ట్ సింగిల్ 'నా మావ పిల్లనిత్తానన్నాడే' అనే ఈ పాటతో మ్యూజిక్ ప్రమోషన్స్ ని కిక్ స్టార్ట్ చేశారు. ఈ సాంగ్ ని మెలోడీ మాస్టర్ హారిస్ జయరాజ్ (Harris Jayaraj) వైబ్రెంట్ అండ్ పుట్ టాపింగ్ నెంబర్ గా కంపోజ్ చేయడం విశేషం. కాసర్ల శ్యామ్ (Kasarla Syam) రాసిన లిరిక్స్ మాస్ ని ఆకట్టుకునేలా వున్నాయి. కారుణ్య, హరిప్రియ తమ ఎనర్జిటిక్ వోకల్స్ తో మెస్మరైజ్ చేశారు.


'బ్యాడ్ బాయ్ కార్తీక్' లోని ఈ సాంగ్ లో నాగశౌర్య, విధి కెమిస్ట్రీ కలర్ ఫుల్ గా వుంది. నాగశౌర్య డ్యాన్స్ మూమెంట్స్ అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ సాంగ్ కి సోషల్ మీడియాలో మంచి స్పందన లభిస్తోంది. ఈ సినిమాలో ఇతర ప్రధాన పాత్రలను సముతిరఖని, నరేష్ విజయకృష్ణ, సాయికుమార్, వెన్నెల కిషోర్, మైమ్ గోపి, శ్రీదేవి విజయ్ కుమార్ తదితరులు పోషిస్తున్నారు. రసూల్ ఎల్లోర్ ఈ మూవీకి సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరిస్తున్నారు.

Also Read: Ashish Vidyarthi: వేషాలకై వేడుకోలు...

Also Read: Bakasura Restaurant Review: 'బకాసుర రెస్టారెంట్‌' ఎలా ఉందంటే..

Updated Date - Aug 08 , 2025 | 06:23 PM