Ritu Varma: దేవికా, డానీ ప్రేమ గొడవేమిటీ...
ABN, Publish Date - May 20 , 2025 | 01:31 PM
రీతు వర్మ నటించిన మొదటి వెబ్ సీరిస్ 'దేవిక అండ్ డానీ'. బి. కిశోర్ దర్శకత్వం వహించిన ఈ వెబ్ సీరిస్ జియో హాట్ స్టార్ లో ప్రసారం కానుంది.
ప్రముఖ కథానాయిక రీతువర్మ (Ritu Varma) ప్రధాన పాత్ర పోషించిన వెబ్ సీరిస్ 'దేవిక అండ్ డానీ' (Devika & Danny ). 'శ్రీకారం' (Sreekaram) ఫేమ్ బి. కిశోర్ దర్శకత్వం వహించిన ఈ వెబ్ సీరిస్ జియో హాట్ స్టార్ లో జూన్ 6న నుండి స్ట్రీమింగ్ కాబోతోంది. ప్రేమ, పెళ్ళి, పగ, ప్రతీకారాల నేపథ్యంలో ఈ వెబ్ సీరిస్ సాగుతుందని తాజాగా విడుదలైన ట్రైలర్ చూస్తుంటే అర్థమౌతోంది.
రీతువర్మ, సుబ్బరాజు (Subbaraju) పెళ్ళికి సంబంధించిన ప్రిపరేషన్స్ జరుగబోతుండగా ఊహించని అవాంతరాలు వస్తాయి. అప్పటి వరకూ అందరి మాట వినే తనకు.... తన మాట వినే వక్తి దొరకడంతో దేవిక ఎలాంటి నిర్ణయం తీసుకుంది? దాని పర్యవసానాలు ఏమిటనేదే ఈ వెబ్ సీరిస్. రీతు వర్మ, సుబ్బరాజుతో పాటు సూర్య వశిష్ఠ, శివ కందుకూరి, మౌనికా రెడ్డి, సోనియా సింగ్, చాగంటి సుధాకర్, కోవై సరళ, గోకరాజు రమణ, అభినయశ్రీ, వైవా హర్ష తదితరులు ఇందులో కీలక పాత్రలు పోషించారు. చాగంటి సుధాకర్ నిర్మించిన ఈ వెబ్ సీరిస్ కు దీపక్ రాజ్ కథను అందించాడు. జయ్ క్రిష్ దీనికి సంగీతం సమకూర్చాడు. తొలిసారి రీతువర్మ చేసిన ఈ వెబ్ సీరిస్ ఏ స్థాయిలో వీక్షకులను ఆకట్టుకుంటుందో చూడాలి.
Also Read: Hari Hara Veera Mallu: పవన్ మూవీకి పాటరాసిన కీరవాణి
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి