సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Dashamakan: రూటు మార్చిన.. నాని కొడుకు! తెలుగులోనూ.. 'దాషమకాన్'

ABN, Publish Date - Nov 22 , 2025 | 06:58 PM

హరీశ్‌ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న 'దాషమకాన్' టైటిల్ ప్రోమో శనివారం విడుదలైంది. ఈ మూవీలో 'కన్నప్ప' ఫేమ్ ప్రీతి ముకుందన్ హీరోయిన్ గా నటిస్తోంది.

Dashamakan Movie

యువ కథానాయకుడు హరీశ్‌ కళ్యాణ్‌ (Harish Kalyan) 'జెర్సీ' సినిమాలో నేచురల్ స్టార్ నాని (Nani) కొడుకు పాత్రను చేశాడు. దానికి ముందు కూడా అతని రెండు మూడు తెలుగు సినిమాల్లో నటించిన గుర్తింపు వచ్చింది మాత్రం క్యూట్ యంగ్ బోయ్ గా నటించిన 'జెర్సీ' మూవీతోనే. తాజాగా అతను తమిళ, తెలుగు భాషల్లో 'దాషమకాన్' (Dashamakan) సినిమాలో చేస్తున్నాడు. వినీత్ వరప్రసాద్ స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న ఈ సినిమా టైటిల్ ప్రోమోను శనివారం విడుదల చేశారు.


'దాషమకాన్' అనేది చెన్నయ్ అవుట్ కట్స్ కు చెందిన ఓ ప్రాంతం. దర్గా ఉండే ఆ ఏరియాలో బీఫ్ ను విశేషంగా అమ్ముతూ ఉంటారు. అక్కడ జరిగిన కథగా దీనిని చూపించారు. ఇక టైటిల్ ప్రోమో గమనిస్తే... ఊర్లో పేరు మోసిన రౌడీకి చెందిన కిరాయి మ‌నుషులు హీరోని వెతుక్కుంటూ.. ఎలాగైనా చంపాల‌ని ఆయుధాల‌తో వెంబ‌డిస్తుంటారు. హీరో బాత్రూమ్‌లోకి వెళ‌తాడు. వాళ్లు కూడా ఫాలో అవుతూ వెళ‌తారు. హీరో బాత్రూమ్‌లో ఒక‌డ్ని వేసేసి తాపీగా బ‌య‌ట‌కు న‌డుచుకుని వ‌స్తాడు. హీరో చంపాల‌నుకున్న విల‌న్ మ‌నుషులు బిక్క చ‌చ్చిపోతారు. ఈ సీన్స్‌తో టైటిల్ ప్రోమో ఇంట్రెస్టింగ్‌గా ఉంది.

హ‌రీష్ క‌ళ్యాణ్ ఇప్పటి వ‌ర‌కు చేసిన పాత్రలకు పూర్తి భిన్నమైన రోల్ ఇది. ప‌క్కా మాస్ యాక్షన్ మూవీగా క‌నిపిస్తోంది. టైటిల్ ప్రోమోలో చేతిలో చుర‌క‌త్తి తిప్పుతాడు హీరో. అది చేతిలో పాట‌లు పాడే మైక్‌లా మారిపోతుంది. అంటే ఈ సినిమాలో హీరో పాత్రలో రెండు షేడ్స్ ఉంటాయ‌నేది తెలుస్తోంది. ఓ షేడ్‌లో పాట‌లు పాడితే.. మ‌రో షేడ్‌లో మాస్ అవ‌తార్‌లో అతను యాక్షన్ తో దుమ్మురేపుతుంటాడు. మ‌రి ఈ రెండు షేడ్స్ వెనుకున్న అస‌లు క‌థ తెలుసుకోవాల‌నే ఆస‌క్తి ఈ టైటిల్ ప్రోమో చూస్తే క‌లుగుతోంది.

'దాషమకాన్' చిత్రంలో 'కన్నప్ప' ఫేమ్ ప్రీతి ముకందన్ హీరోయిన్ గా నటిస్తోంది. సత్యరాజ్, సునీల్ ఇందులో కీలక పాత్రలు పోషిస్తున్నారు. బ్రిట్టో మైకేల్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాకు కార్తీక్ అశోకన్ సినిమాటోగ్రఫీ సమకూర్చుతున్నాడు.

Updated Date - Nov 22 , 2025 | 08:44 PM