Samantha: మూడు నెలలకు ఓసారి.. కొన్నేళ్లగా ఇలా జరుగుతుంది..

ABN , Publish Date - Oct 06 , 2025 | 12:03 PM

'మనల్ని ఇబ్బందిపెట్టే ప్రతి విషయం మనకు పాఠం నేర్పుతుంది. అలాంటి వాటి నుంచి కూడా ఏదో ఒకటి నేర్చుకోండి' అని అంటున్నారు సమంత.  ‘

'మనల్ని ఇబ్బందిపెట్టే ప్రతి విషయం మనకు పాఠం నేర్పుతుంది. అలాంటి వాటి నుంచి కూడా ఏదో ఒకటి నేర్చుకోండి' అని అంటున్నారు సమంత.  ‘శుభం’ (Subham)చిత్రంత మాయ మాతశ్రీగా కామియో చేసి మెప్పించారు సమంత(Samantha). ఆ చిత్రానికి నిర్మాతగానూ వ్యవహరించి విజయం సాధించారు. ఈ సినిమా సక్సెస్‌తో తన సొంత బ్యానర్‌ ట్రాలాలా మూవింగ్‌ పిక్చర్స్‌లో వరుసగా కథా బలమైన చిత్రాలు తీయాలని ప్లాన్‌ చేస్తున్నారు. ఆ దిశగా కథలు వింటూ బిజీగా ఉన్న సమంత ప్రస్తుతం రిలాక్స్‌ మోడ్‌లోకి వెళ్లారు. కాస్త విశ్రాంతి తర్వాత మళ్లీ సెట్‌లో అడుగుపెట్టడానికి సిద్ధమవుతున్నారు. ఆమె తనకెంతో ఇష్టమైన ఈషా ఫౌండేషన్‌కు (Isha Foundation) వెళ్తున్నారు. ఈ మేరకు ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ పెట్టారు.

Sam-2.jpg

‘మళ్లీ ఆ సమయం వచ్చింది, ప్రతి మూడు నెలలకు ఓసారి నేను నిశబ్ధంలోకి వెళ్తాను. ఇలా కొన్నేళ్లగా జరుగుతోంది. నాకు పవిత్రమైన స్థలమిది. ఈ ఆనంద నిలయం నాకు రెండో ఇల్లు లాంటిది. కష్టంలో, ఎత్తుపల్లాలతో ఇబ్బంది పడుతున్న సమయంలో  ఊరట కలిగించింది. ఇదే నాకు ఆనంద నిలయం’ అని సమంత ఈషా ఫౌండేషన్‌ గురించి చెప్పుకొచ్చారు.

Sam.jpg

అలాగే తన నిర్మాణంలో, కథానాయికగా నటించనున్న ‘మా ఇంటి బంగారం’ చిత్రం అప్‌డేట్‌ కూడా ఇచ్చారు సామ్‌. ఈ నెలలో షూటింగ్‌కు వెళ్తునట్లు చెప్పారు. ఈ కథ విషయంలో ఎంతో ఎగ్జైటింగ్‌గా ఉన్నట్లు చెప్పారు. కొంతకాలంగా మయోసైటీస్‌ అనే అరుదైన వ్యాధితో బాధపడుతున్న సమంత ఇప్పుడిప్పుడే కోలుకుని మళ్లీ సినిమాలతో బిజీ కానున్నారు.

Updated Date - Oct 06 , 2025 | 02:45 PM