Chiranjeevi, Balakrishna: స్టార్ హీరోల చిత్రాలకు కొరత...
ABN , Publish Date - Oct 06 , 2025 | 12:15 PM
దసరాకు ప్రారంభం కావాల్సిన నందమూరి బాలకృష్ణ చారిత్రక చిత్రం, చిరంజీవి -బాబీ కాంబినేషన్ లో దసరాకు మొదలు కావాల్సిన సాంఘిక చిత్రాలు సినిమాటోగ్రాఫర్స్ ఫైనలైజ్ కాకపోవడంతో వాయిదా పడ్డాయని అంటున్నారు.
నందమూరి నట సింహం బాలకృష్ణ (Balakrsihna) ప్రస్తుతం 'అఖండ 2' (Akhanda -2) చిత్రంలో నటిస్తున్నారు. దసరా కానుకగా విడుదల కావాల్సి ఉన్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ అనుకున్న సమయంలో జరగకపోవడంతో డిసెంబర్ 5వ తేదీకి వాయిదా పడింది. మొన్నటి వరకూ 'ఓజీ' (OG) మీద, ఆ తర్వాత 'తెలుసుకదా' చిత్రాల మీద పూర్తి స్థాయిలో తన ఎఫెర్ట్స్ ను పెట్టిన సంగీత దర్శకుడు తమన్ (Thaman) ఇప్పుడు 'అఖండ -2' మీద కాన్సంట్రేషన్ చేయబోతున్నాడు. 'ఓజీ' విజయంలో కీలకపాత్రధారి అయిన తమన్ మీద ఇప్పుడు 'అఖండ 2'ను సైతం విజయ పథంలో నడిపించాల్సిన బాధ్యత పడింది. తమన్ కు తగినంత సమయం ఇవ్వడం కోసమే 'అఖండ -2'ను డిసెంబర్ మొదటి వారానికి వాయిదా వేసినట్టుగా బాలకృష్ణే స్వయంగా చెప్పారు.
ఇదిలా ఉంటే... సహజంగా స్టార్ హీరోల చిత్రాలకు హీరోయిన్ల కొరత ఉండేది. వారి సీనియారిటీకి తగ్గట్టుగా గ్రేస్ ఉన్న స్టార్ హీరోయిన్లు దొరకడం ఒక్కోసారి కష్టం అయ్యేది. ఎందుకంటే ఆ స్థాయి హీరోయిన్లు ఎవరైనా ఇవాళ పలు భాషల్లో నటిస్తుండటంతో వారి డేట్స్ దొరకడం కష్టంగా ఉంటోంది. అయినా ఏవో తిప్పలు పడి మేకర్స్ హీరోయిన్స్ ను సెట్ చేసుకుంటూ ఉంటారు. కానీ చిత్రంగా టాలీవుడ్ సీనియర్ స్టార్స్ చిరంజీవి, బాలకృష్ణ సినిమాలకు సరైన సినిమాటోగ్రఫర్స్ దొరక్కపోవడంతో సినిమా ప్రారంభోత్సవాన్ని వాయిదా వేసుకున్న సందర్భాలు ఏర్పడ్డాయి.
దసరా రోజున బాలకృష్ణ, గోపీచంద్ మలినేని కాంబోలో ఓ సినిమా మొదలు అవుతుందని మొదట వార్తలు వచ్చాయి. కానీ ఆ సినిమా ప్రారంభోత్సవం అక్టోబర్ 24కు వాయిదా పడింది. ఈ సినిమాకు 'కాంతార' ఫేమ్ అరవింద్ కశ్యప్ సినిమాటోగ్రఫీ అందిస్తారని అంటున్నారు. అలానే మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం 'విశ్వంభర'తో పాటు 'మన శంకర వరప్రసాద్ గారు' సినిమాలలో నటిస్తున్నాడు. ఇప్పటికే షూటింగ్ ముగించుకున్న 'విశ్వంభర' వచ్చే యేడాది వేసవి కానుకగా రానుండగా, సెట్స్ పై ఉన్న 'మన శంకర్ ప్రసాద్' జనవరిలో సంక్రాంతికి కానుకగా జనం ముందుకు రాబోతోంది.
Also Read: Sachin : క్రికెట్ గాడ్ తో తమన్... ఏం చేయబోతున్నాడు...
Also Read: Samantha: మూడు నెలలకు ఓసారి.. కొన్నేళ్లగా ఇలా జరుగుతుంది..