De De Pyaar De 2: ఓరి దేవుడో... రకుల్ వైబ్ మామూలుగా లేదుగా...
ABN, Publish Date - Oct 30 , 2025 | 02:22 PM
అజయ్ దేవ్ గన్, రకుల్ ప్రీత్ లేటెస్ట్ మూవీ దే దే ప్యార్ దే నవంబర్ 14న విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా మేకర్స్ పబ్ సాంగ్ ను రిలీజ్ చేశారు. ఇందులో రకుల్ ఎరోటిక్ డాన్స్ మూమెంట్స్ కుర్రకారుని పిచ్చెక్కిస్తున్నాయి.
అజయ్ దేవ్ గన్ (Ajay Devgn) , రకుల్ ప్రీత్ సింగ్ (Rakul Preet Singh) జంటగా నటించిన 'దే దే ప్యార్ దే' (De De Pyaar De) చిత్రానికి ఇప్పుడు సీక్వెల్ రెడీ అయ్యింది. అన్షూల్ శర్మ డైరెక్ట్ చేసిన 'దే దే ప్యార్ దే -2' (De De Pyaar De 2) నవంబర్ 14న విడుదల కాబోతోంది. దాంతో పబ్లిసిటీ జోరు పెంచిన మేకర్స్ తాజాగా 'జూమ్ షరాబీ' (Jhoom Sharaabi) అనే పబ్ సాంగ్ ను రిలీజ్ చేశారు. అజయ్ దేవ్ గన్ తన మిత్రులతో కలిసి పబ్ లో మందు కొడుతూ పాడే ఈ పాటలో రకుల్ సింగ్ అందాల విందు చేస్తూ వేడి సెగలు పుట్టించేసింది. రకుల్ వేసింది సింపుల్ స్టెప్సే అయినా... ఎరోటిక్ మూమెంట్స్ తో కుర్రకారుని తన వైపు తిప్పేసుకుంది. నిజం చెప్పాలంటే... ఈ పాట హీరోహీరోయిన్ల మీద తీసినట్టుగా లేదు... ఐటమ్ సాంగ్ ను తీసినట్టుగా ఉంది. గతంలో వచ్చిన 'జూమ్ షరాబీ'కి సాంగ్ కు ఇది రీమిక్స్. అజయ్ దేవ్ గన్ తో పాటు యో యో హనీసింగ్ (Yo Yo Honey Singh) వేసిన స్టెప్స్ కూడా సూపర్ కూల్ గా ఉండి... చూసే వాళ్ళను మెస్మరైజ్ చేశాయి.
ఈ మధ్య కాలంలో బాలీవుడ్ లో ఐటమ్ సాంగ్ అంటే అందరికీ ఠక్కున్న గుర్తొస్తున్న పేరు తమన్నాదే! అయితే ఈ పాట విడుదలైన దగ్గర నుండి రకుల్ ప్రీత్ సింగ్ ఒప్పుకోవాలే కానీ ఆమెతోనూ ఐటమ్ సాంగ్స్ ను మేకర్స్ ప్లాన్ చేసుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. మామూలుగానే గ్లామర్ డాల్ అనిపించుకునే రకుల్ ప్రీత్ సింగ్ పిక్ శారీలో మరింత గ్లామరస్ గా ఈ పాటలో కనిపించింది. ఈ పాట ఇలా విడుదలైందో లేదో... అలా నెటిజన్స్ ఆమె హాట్ నెస్ గురించి చర్చించడం మొదలు పెట్టేశారు. ఆ సాంగ్ లోంచి రకుల్ ప్రీత్ సింగ్ మూమెంట్స్ ను స్క్రీన్ షాట్ తీసి విపరీతంగా వైరల్ చేస్తున్నారు. చిల్డ్రన్స్ డేన జనం ముందుకు రాబోతున్న 'దే దే ప్యార్ దే 2' సినిమా ఎలా ఉంటుందో ఏమో కానీ ఈ సాంగ్ కోసమైనా కుర్రకారు థియేటర్ల ముందు క్యూ కట్టడం గ్యారంటీ అనిపిస్తోంది.
Also Read: Yash: టాక్సిక్ పై రూమర్స్... క్లారిఫై చేసిన నిర్మాత
Also Read: Allu Sireesh Engagement: దేవుడు మరోలా ప్లాన్ చేశాడు...