Yash: టాక్సిక్ పై రూమర్స్... క్లారిఫై చేసిన నిర్మాత

ABN , Publish Date - Oct 30 , 2025 | 01:32 PM

యశ్ నటిస్తున్న పాన్ ఇండియా మూవీ 'టాక్సిక్' విడుదల వాయిదా పడొచ్చని జరుగుతున్న పుకార్లకు నిర్మాత వెంకట నారాయణ చెక్ పెట్టారు. ఉగాది కానుకగా ఈ సినిమా మార్చి 19న విడుదల కావడం ఖాయమని అన్నారు.

Toxic Movie

శాండిల్ వుడ్ స్టార్ హీరో యశ్‌ (Yash) నటిస్తున్న 'టాక్సిక్' (Toxic) పై అనౌన్స్ మెంట్ రోజు నుండే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. గీతూ మోహన్ దాస్ (Geetu Mohan Das) దర్శకత్వంలో ఈ సినిమాను కె.వి.యన్. ప్రొడక్షన్స్ పతాకంపై వెంకట్ కె నారాయణ (Venkat K Narayana) దీన్ని నిర్మిస్తున్నారు. అయితే... రెండు రోజులుగా సోషల్ మీడియాలో 'టాక్సిక్' మూవీ ముందు అనుకున్న విధంగా మార్చి 19న వచ్చే ఆస్కారం లేదనే ప్రచారం జరుగుతోంది. అదే రోజున అడివి శేష్, మృణాల్‌ ఠాకూర్ నటిస్తున్న 'డకాయిట్' (Dacoit) మూవీ సైతం తెలుగు, హిందీ భాషల్లో రాబోతోంది. అయితే... ఈ పుకార్లకు నిర్మాత వెంకట్ నారాయణ చెక్ పెట్టారు. ముందు అనుకున్న విధంగా మరో 140 రోజుల్లో తమ చిత్రం థియేటర్లలో విడుదల అవుతుందని సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. ఉగాది, గుడి పడ్వా, ఈద్ కానుకగా ఈ సినిమాను విడుదల చేస్తున్నామని చెప్పారు.


ఇదిలా ఉంటే... యశ్ ప్రస్తుతం ముంబైలో 'రామాయణ' (Ramayana) షూటింగ్ లో పాల్గొంటున్నాడు. అందువల్ల 'టాక్సిక్'కు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ను మొదలు పెట్టారు. ఆ తర్వాత సినిమా షూటింగ్ ను పూర్తి చేసి, జనవరి నుండి పూర్తి స్థాయిలో ప్రమోషన్స్ కు శ్రీకారం చుడతారు. ఈ సినిమాను కన్నడతో పాటు ఇంగ్లీష్‌ లోనూ చిత్రీకరిస్తున్నారు. తొలి కాపీ వచ్చిన తర్వాత ప్రధార భారతీయ భాషలైన హిందీ, తెలుగు, తమిళ, మలయళం లో డబ్ చేస్తారు. సో... యశ్‌ 'టాక్సిక్' ఉగాది కానుకగా మార్చి 19న విడుదల కావడం ఖాయం!

Also Read: Allu Sireesh Engagement: దేవుడు మరోలా ప్లాన్ చేశాడు...

Also Read: Mahakali: మహాకాళిగా కన్నడ నటి భూమి శెట్టి 

Updated Date - Oct 30 , 2025 | 01:37 PM