Akira Nandan: సిగ్గేస్తుంది నిను చూస్తుంటే.. అకీరా ఫొటోలతో యూట్యూబర్ కవర్ సాంగ్

ABN , Publish Date - Oct 15 , 2025 | 08:07 PM

ఇండస్ట్రీ.. ప్రస్తుతం నట వారసుల రాక కోసం ఎదురుచూస్తుంది.

Akira Nandan

Akira Nandan: ఇండస్ట్రీ.. ప్రస్తుతం నట వారసుల రాక కోసం ఎదురుచూస్తుంది. ఎప్పుడెప్పుడు తమ అభిమాన హీరోల వారసులు టాలీవుడ్ ఎంట్రీ ఇస్తారా అని ఫ్యాన్స్ వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు. అయితే బాలీవుడ్ లో సినిమా రిలీజ్ అయ్యాకా వారసులకు ఫ్యాన్స్ ఉంటారు. కానీ, తెలుగులో అలా కాదు.. సినిమా రిలీజ్ అవ్వకపోయినా తండ్రికి సమానంగా ఫ్యాన్ బేస్ ఉంటుంది. అలాంటి వారసుల్లో అకీరా నందన్ కొణిదెల ఒకడు.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్- రేణు దేశాయ్ ల పెద్ద కొడుకు అకీరా నందన్. ఆరడుగుల ఎత్తు.. తండ్రిని మించిన అందంతో 18 ఏళ్లకే హీరో మెటీరియల్ అని అనిపించుకుంటున్నాడు. అంతేనా తండ్రిలానే అన్ని కళలో ప్రావీణ్యం పొందాడు. సినిమాలో ఎంట్రీ ఇవ్వకపోయినా.. ఎయిర్ పోర్ట్ లుక్, థియేటర్ లుక్ నే ఎడిట్స్ చేసి సోషల్ మీడియాలో షేక్ చేయడం మొదలుపెట్టారు.

అకీరా ఎప్పుడెప్పుడు సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తాడా అని పవన్ ఫ్యాన్స్ కళ్లలో ఒత్తులు వేసుకొని చూస్తున్నారు. కానీ, రేణు మాత్రం ఇప్పుడప్పుడే కొడుకును సినిమాల్లోకి పంపించే ఛాన్స్ లేదని ఖరాకండీగా చెప్పేసింది. కానీ, అకీరాకు సోషల్ మీడియాలో ఉన్న క్రేజ్ చూస్తే మెంటలొచ్చేస్తుంది. సాధారణంగా కవర్ సాంగ్స్ హీరో ఫోటోలను పెట్టుకొని చేసినవాళ్లు ఉన్నారు. తాజాగా ఒక యూట్యూబర్.. అకీరా ఫొటోలతో కవర్ చేసింది.

నందమూరి హరికృష్ణ- సిమ్రాన్ నటించిన సీతయ్య సినిమా తెలియని వారుండరు. ముఖ్యంగా ఆ సినిమాలోని సాంగ్స్ చార్ట్ బస్టర్స్ అంతే. ఒక్క మగాడు, బస్సెక్కి వస్తావో బండెక్కి వస్తావో లాంటి సాంగ్స్ ట్రోల్స్ చేయడానికి ఇప్పటికీ వాడుతూనే ఉంటారు. ఇక రొమాంటిక్ సాంగ్స్ లో సిగ్గేస్తుంది నిను చూస్తుంటే సాంగ్ ఎప్పుడు టాప్ లో ఉంటుంది అంటే అతిశయోక్తి కాదు. పూల తోటల్లో హరికృష్ణ ఫోటోలు పెట్టుకొని.. అతడిపై ఉన్న ప్రేమ భావాలను సిమ్రాన్ చాలా రొమాంటిక్ గా చెప్తూ ఉంటుంది.

ఇక సదురు యూట్యూబర్ ఈ సాంగ్ కు కవర్ సాంగ్ చేసింది. కాకపోతే హరికృష్ణ ఫోటోలు కాకుండా అకీరా ఫోటోలు పెట్టింది. అకీరా ఫోటోల దగ్గర డ్యాన్స్ చేస్తూ సిగ్గేస్తుంది నిను చూస్తుంటే అంటూ వయ్యారాలు పోయింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ గా మారాయి. ఈ వీడియో చూసిన అభిమానులు హీరో కాకముందే ఇంత క్రేజ్ ఏంట్రా బాబు అంటూ కామెంట్స్ పెడుతున్నారు.

Prabhas- Anushka: అబ్బా.. ఎంత క్యూట్ గా హాయ్ చెప్పార్రా..

Kiran Abbavaram: పవన్ కళ్యాణ్ ను వాడుకుంటున్నాననుకుంటారు

Updated Date - Oct 15 , 2025 | 08:28 PM