Prabhas- Anushka: అబ్బా.. ఎంత క్యూట్ గా హాయ్ చెప్పార్రా..
ABN , Publish Date - Oct 15 , 2025 | 06:42 PM
ఇండస్ట్రీలో కొన్ని జంటలు ఉంటాయి. రియల్ గా వీళ్లేందుకు భార్యాభర్తలు కాకూడదు అనే ప్రశ్నను ప్రేక్షకుల మెదడుల్లో వచ్చేలా చేస్తాయి. అంతలా వారి మధ్య కెమిస్ట్రీ ఉంటుంది.
Prabhas- Anushka: ఇండస్ట్రీలో కొన్ని జంటలు ఉంటాయి. రియల్ గా వీళ్లేందుకు భార్యాభర్తలు కాకూడదు అనే ప్రశ్నను ప్రేక్షకుల మెదడుల్లో వచ్చేలా చేస్తాయి. అంతలా వారి మధ్య కెమిస్ట్రీ ఉంటుంది. రీల్ లో చూసినా.. రియల్ గా చూసినా ఆ జంటను చూడాలనిపిస్తూనే ఉంటుంది. అలాంటి జంటల్లో మొట్ట మొదటి స్థానంలో ఉంటారు ప్రభాస్ - అనుష్క. వీరిద్దరి కాంబోకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉందనే చెప్పాలి.
బిల్లా నుంచి మొదలైన వీరి ప్రయాణం.. మిర్చి, బాహుబలి 1, బాహుబలి 2 తో కొనసాగుతూ వచ్చింది. ఆన్ స్క్రీన్ లో ప్రభాస్ పక్కన పర్ఫెక్ట్ హీరోయిన్ అంటే అది అనుష్క మాత్రమే. ఎంతమంది హీరోయిన్లు వచ్చినా డార్లింగ్ కు సెట్ అయ్యే హీరోయిన్ అంటే స్వీటీనే. మిర్చి దగ్గర నుంచి వీరిద్దరూ బయట కూడా పెళ్లి చేసుకుంటే బావుంటుందని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తూనే ఉన్నారు.
కొంతమంది అయితే ఏఐ ద్వారా వీరిద్దరికి పెళ్లి చేసేసి.. పిల్లలను కూడా పక్కన యాడ్ చేస్తున్నారు. అయినా తామిద్దరం ఫ్రెండ్స్ మాత్రమే అని ప్రభాస్ - అనుష్క చెప్పుకొస్తున్నారు. ఇక వీరిద్దరూ కలిసి నటించిన బాహుబలి ది ఎపిక్ రిలీజ్ కు సిద్దమవుతుంది. అక్టోబర్ 31 న ఈ సినిమా రిలీజ్ కానుంది. ఇక ఎన్నిసార్లు చూసినా కూడా బాహుబలి కోసం అభిమానులు వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు.
ఇక రాజమౌళి సినిమా అంటే ప్రమోషన్స్ ఎలా ఉంటాయో అందరికీ తెల్సిందే. కొత్త సినిమా అయినా రీ రిలీజ్ అయినా కూడా హైప్ ఇవ్వడంలో జక్కన్న తరువాతే. ఇక బాహుబలి ప్రమోషన్స్ లో కొన్ని రోజుల నుంచి బ్లూపర్స్ ను రిలీజ్ చేస్తున్నారు. షూటింగ్ సమయంలో ప్రభాస్, అనుష్క, రానా, తమన్నా మధ్య జరిగిన ఫన్నీ మూమెంట్స్ ను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు.
తాజాగా ప్రభాస్ - అనుష్క కెమెరాకు హాయ్ చెప్తున్న వీడియో ఒకదాన్ని మేకర్స్ పోస్ట్ చేశారు. బాహుబలి 2 షూటింగ్ సమయంలో ఈ వీడియో తీసినట్లు కనిపిస్తుంది. గర్భవతిగా ఉన్న దేవసేన పక్కన బాహుబలి ఇద్దరిని కెమెరాకు హాయ్ చెప్పమని అడగ్గా.. వారిద్దరూ రకరకాలుగా హాయ్ చెప్పారు. ఆ వీడియో ఎన్నిసార్లు చుసిన ఇంకా చూడాలనిపించేలా ఉంది. డార్లింగ్ - స్వీటీ ఇద్దరు చూడముచ్చటగా ఉన్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. అబ్బా .. ఎంత క్యూట్ గా హాయ్ చెప్పార్రా అంటూ నెటిజన్స్ కామెంట్స్ పెడుతున్నారు. మరి ఈసారి బాహుబలి ది ఎపిక్ ఎలాంటి రికార్డులను బద్దలు కొడుతుందో చూడాలి.
Sai Durga Tej: మా ముగ్గురు మావయ్యలకు ధ్యాంక్స్...
Ram Pothineni: రామ్ పోతినేని ఎఫైర్.. జగ్గూభాయ్ ఏంటి అంత మాట అనేశాడు