Kiran Abbavaram: పవన్ కళ్యాణ్ ను వాడుకుంటున్నాననుకుంటారు

ABN , Publish Date - Oct 15 , 2025 | 03:40 PM

కుర్ర హీరో కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram) గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

Kiran Abbavaram

Kiran Abbavaram: కుర్ర హీరో కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram) గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. క సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న కిరణ్.. ప్రస్తుతం కె ర్యాంప్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. అక్టోబర్ 31 న కె ర్యాంప్రిలీజ్ కు సిద్దమవుతుంది. రిలీజ్ డేట్ దగ్గరపడుతుండడంతో కిరణ్ ప్రమోషన్స్ మొదలుపెట్టాడు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, ట్రైలర్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.

ఇక కె ర్యాంప్ ప్రమోషన్స్ లో భాగంగా కిరణ్ చేసిన వ్యాఖ్యలు చాలా వైరల్ గా మారాయి. థియేటర్ల గురించి మాట్లాడింది కావచ్చు, ప్రదీప్ రంగనాథన్ కించపరచడం తప్పు అని చేసిన వ్యాఖ్యలు కావచ్చు.. ఇలా ప్రతిదానిలో కిరణ్ హైలైట్ అవుతూ వచ్చాడు. తాజాగా మరోసారి కిరణ్ సోషల్ మీడియా సెన్సేషన్ గా మారాడు. ఈసారి తాను ఎంతో అభిమానించే పవన్ కళ్యాణ్ గురించి అడిగిన ప్రశ్నను తిరస్కరించి షాక్ ఇచ్చాడు.

కిరణ్ అబ్బవరం మొదటి నుంచి పవన్ కళ్యాణ్ కు బిగ్ ఫ్యాన్. ఏ సినిమా ఈవెంట్ లో అయినా కూడా పవన్ గురించి మాట్లాడి.. ఆయన అంటే ఎంత ఇష్టమో చెప్పేవాడు. ఒక షోలో అయితే పవన్ తరువాత కిరణ్ అబ్బవరం అనే చెప్పుకొచ్చారు. దానివలన ట్రోల్స్ కూడా ఎదుర్కున్నాడు. ఆ తరువాత పవన్ టాపిక్ వస్తే కొంచెం జాగ్రత్త పడుతున్నాడు. ఇప్పుడు కూడా ఒక అభిమాని.. మీ ఫేవరేట్ హీరో పవన్ కళ్యాణ్ ఓజీ సినిమా మొదటిరోజే చూసారు. ఆ అనుభవం ఎలా ఉందో చెప్తారా.. ? అన్న ప్రశ్నకు కిరణ్ షాకింగ్ ఆన్సర్ ఇచ్చాడు.

'అది వద్దులెండి. వద్దు అని ఎందుకు అంటున్నాను అంటే.. నేను నిజంగానే పవన్ కళ్యాణ్ గారికి ఫ్యాన్. కానీ, అదే విషయం ఎక్కువ సార్లు చెప్తున్నా.. ఎక్కువ సార్లు మాట్లాడుతున్నా ప్రాబ్లెమ్ ఏం అవుతుంది అంటే.. చాలామంది నేను పవన్ కళ్యాణ్ పేరును వాడుకుంటున్నాననుకుంటున్నారు. ఒకసారి రెండు సార్లు ఆయన గురించి ఏదైనామాట్లాడితే.. దాన్ని పదిసార్లు అలాగే చూపిస్తూ వేరేలా కన్వర్ట్ చేస్తున్నారు. అది నేను గమనించాను.

ఇప్పుడు నా సినిమా రిలీజ్ ఉంది. దానికోసమే ఎక్కువ వాడుకుంటున్నారేమో, టిక్కెట్లు ఎక్కువ తెగుతాయేమో అనే ఫీలింగ్ వారిలో వస్తుంది. అది నాకు వద్దు. అందుకే ఇప్పుడు ఓజీ గురించి అడగొద్దు అన్నాను' అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.

Bollywood: మహాభారత్ కర్ణుడి కన్నుమూత

Tollywood: కొడుకు హీరోగా విజయ భాస్కర్ మూడో సినిమా...

Updated Date - Oct 15 , 2025 | 03:41 PM