సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

War 2: ప్రీ రిలీజ్ ఈవెంట్ ఖర్చే అన్ని కోట్లా..

ABN, Publish Date - Aug 11 , 2025 | 08:12 PM

ఏదైనా ప్రోడక్ట్ ను ఎన్ని కోట్లు పెట్టి తయారు చేసాం అన్నది కాదు ముఖ్యం. దాన్ని ప్రజల్లోకి ఎంతవరకు తీసుకెళ్లగలిగాం అనేది పాయింట్. వంద కోట్లు పెట్టి సినిమా తీసి ఏం ప్రయోజనం.. ఆ సినిమాను ప్రేక్షకులు చూడగలిగేలా చేస్తేనే కదా పెట్టిన డబ్బులు తిరిగి వచ్చేది.

War 2

War 2: ఏదైనా ప్రోడక్ట్ ను ఎన్ని కోట్లు పెట్టి తయారు చేసాం అన్నది కాదు ముఖ్యం. దాన్ని ప్రజల్లోకి ఎంతవరకు తీసుకెళ్లగలిగాం అనేది పాయింట్. వంద కోట్లు పెట్టి సినిమా తీసి ఏం ప్రయోజనం.. ఆ సినిమాను ప్రేక్షకులు చూడగలిగేలా చేస్తేనే కదా పెట్టిన డబ్బులు తిరిగి వచ్చేది. దాన్ని మార్కెటింగ్ స్ట్రాటజీ అంటారు. ఈమధ్యకాలంలో మేకర్స్ ఎక్కువ దీనిమీదనే ఫోకస్ పెడుతున్నారు. సినిమా ఎన్నికోట్లు పెట్టి తీసాం అన్నది కాదు.. ప్రమోషన్స్ ఎన్ని కోట్లు పెట్టి చేసాం అన్నదే చూస్తున్నారు. కొత్త కొత్త విధానాల్లో ఎంత డబ్బు ఖర్చుపెట్టి అయినా తమ సినిమాను ప్రమోట్ చేస్తున్నారు.


తాజాగా గతరాత్రి జరిగిన వార్ 2 ప్రీ రిలీజ్ ఈవెంట్ ఖర్చు అక్షరాలా కోటి 70 లక్షలు. ఏంటి నిజమా అంటే అవును అంతే అయ్యిందని ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది. అంతలా ఏం చేశారు అంటే.. ఎన్టీఆర్, హృతిక్ రోషన్ మల్టీస్టారర్ గా తెరకెక్కిన సినిమా అంటే ఏ రేంజ్ లో ప్రమోషన్స్ ఉండాలి . అది కూడా తెలుగులో అంటే ఎన్టీఆర్ రేంజ్ కు ఎక్కడా తగ్గకుండా చేయాలి. అందులో వార్ 2 ను నిర్మిస్తుంది ఆషామాషీ నిర్మాణ సంస్థ కాదు. బాలీవుడ్లోనే టాప్ ప్రొడక్షన్ హౌస్ అయిన యష్ రాజ్ ఫిల్మ్స్.


అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో ఎన్టీఆర్ హృతిక్ రోషన్ మల్టీస్టారర్ గా తెరకెక్కిన వార్ 2.. ఆగస్టు 14 న ప్రేక్షకుల ముందుకు రానుంది. రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో ప్రమోషన్స్ వేగాన్ని పెంచిన మేకర్స్.. హైదరాబాద్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించారు. ఈ ఈవెంట్ కోసం YRF చాలా భారీగానే ఖర్చుపెట్టింది. అది నిన్న ఈవెంట్ లోనే తెలుస్తోంది. నిజం చెప్పాలంటే ఇప్పటివరకు వచ్చిన ప్రమోషన్స్ కంటెంట్ లో మొదటి మరియు చివరి వేడుక కూడా ఇదే అని చెప్పాలి. అసలు బజ్ కూడా లేని వార్ 2 మీద ఒక్కసారిగా ఈ ఈవెంట్ హైప్ తీసుకొచ్చింది. అందుకే ఈ ఈవెంట్ వార్ 2 కు చాలా ముఖ్యమని భావించి YRF ఇంత ఖర్చుపెట్టినట్లు తెలుస్తోంది. మరి ఈ సినిమా ఆగస్టు 14 న ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

Nidhhi Agerwal: నాకేం సంబంధం లేదంటూ నిధీ అగర్వాల్‌ క్లారిటీ 

The Paradise: వాడి జడలను ముట్టుకుంటే.. వాడు జర్ర్ మంటాడు

Updated Date - Aug 11 , 2025 | 08:12 PM