The Paradise: వాడి జడలను ముట్టుకుంటే.. వాడు జర్ర్ మంటాడు
ABN , Publish Date - Aug 11 , 2025 | 07:15 PM
న్యాచురల్ స్టార్ నాని (Nani) ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. దసరా తరువాత నాని - శ్రీకాంత్ ఓదెల కాంబోలో వస్తున్న చిత్రం ది ప్యారడైజ్ (The Paradise).
The Paradise: న్యాచురల్ స్టార్ నాని (Nani) ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. దసరా తరువాత నాని - శ్రీకాంత్ ఓదెల కాంబోలో వస్తున్న చిత్రం ది ప్యారడైజ్ (The Paradise). ఈ సినిమాపై అభిమానులు భారీ అంచనాలను పెట్టుకున్నారు. SLV సినిమాస్ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, ఫస్ట్ గ్లింప్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకోవడంతో పాటు అమాంతం అంచనాలను పెంచేసింది.
నాని తన సినిమాలకు హైప్ ఎలా తీసుకురావాలో బాగా తెలిసినవాడు. సినిమా షూటింగ్ నేపథ్యంలో ఉండగానే.. అందులో నుంచి బాగా ఎలివేట్ అయ్యే అంశాలను ప్రేక్షకులకు కొద్దీ కొద్దిగా చూపిస్తూ ఉంటాడు. ఇప్పటివరకు పక్కింటి కుర్రాడిగా అలరించిన నాని ప్రస్తుతం మాస్ హీరోగా మారడానికి ట్రై చేస్తున్నాడు. దానికోసమే ఊర మాస్ కథలను ఎంచుకొని అందుకు తగ్గట్లు మేకోవర్ తో అదరగొడుతున్నాడు. ఇక ప్యారడైజ్ కోసం నాని జడల్ గా మారాడు. ఇప్పటివరకు ఏ హీరో ప్రయత్నించని లుక్ ను నాని ట్రై చేశాడు. రెండు జడలు.. ముక్కుకు ముక్కెరతో చాలా డిఫరెంట్ లుక్ లో కనిపించాడు.
ఇక గత రెండు రోజులుగా ప్యారడైజ్ నుంచి వరుస సర్ ప్రైజ్ లు ఇస్తూ వస్తున్నాడు నాని. మొన్నటికి మొన్న జడల్ పాత్రను పరిచయం చేయడంతో పాటు.. అతని లుక్ ను రివీల్ చేశాడు. ఇక ఇప్పుడు స్పార్క్ ఆఫ్ ది ప్యారడైజ్ అని ఒక యాక్షన్ సీక్వెన్స్ మేకింగ్ వీడియోను ప్రేక్షకులతో పంచుకున్నారు. ఈ వీడియోలో శ్రీకాంత్ ఓదెల.. హీరో ఇంట్రడక్షన్ గురించి ఎలివేషన్ ఇవ్వడం.. ఇంకోపక్క నాని అందుకు తగ్గట్లుగా చూపించడం అదిరిపోయింది. ఇక జైలు సీక్వెన్స్ లో రౌడీలను జడల్ చితక్కొట్టే సీన్ నెక్స్ట్ లెవెల్ అని తెలుస్తోంది. ఇక చివరలో వాడి జడలు ముట్టుకుంటే వాడికి జర్రుమంటుంది అనే డైలాగ్ తో అతడి కోపం ఎలాంటిదో చెప్పకనే చెప్పుకొచ్చారు. ఈ సినిమాలో నాని నట విశ్వరూపం చూపించాడని అర్ధమవుతుంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మరి ఈ సినిమాతో నాని ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.
Mahavatar Narsimha: దుమ్మురేపుతున్న మహావతార్ నరసింహ
Shyamala Devi: ప్రభాస్ పెళ్లి.. ఆ శుభ సమయం రానుంది