Ustaad Bhagat Singh: షెడ్యూల్ పూర్తి...

ABN , Publish Date - Aug 05 , 2025 | 10:05 AM

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan), దర్శకుడు హరీశ్‌ శంకర్ (Hareesh Sankar) కాంబినేషన్ లో రూపుదిద్దుకుంటున్న 'ఉస్తాద్ భగత్ సింగ్' మూవీ తాజా షెడ్యూల్ పూర్తయ్యింది.

Ustaad Bhagat Singh

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan), దర్శకుడు హరీశ్‌ శంకర్ (Hareesh Sankar) కాంబినేషన్ లో రూపుదిద్దుకుంటున్న 'ఉస్తాద్ భగత్ సింగ్' మూవీ తాజా షెడ్యూల్ పూర్తయ్యింది. ఆగస్ట్ 4 నుండి సినీ కార్మికులు సమ్మె మొదలు పెట్టిన నేపథ్యంలో సోమవారం 'ఉస్తాద్ భగత్ సింగ్' (Ustaad Bhagat Singh) షూటింగ్ కు అంతరాయం ఏర్పడింది. ఈ సినిమా పాట చిత్రీకరణ కోసం డాన్సర్స్ తో ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో సినీ కార్మికులు షూటింగ్ ను అడ్డుకోవడానికి ప్రయత్నించారు. వారితో మూవీ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ చెర్రీ వాగ్వివాదానికి దిగారు. పరిస్థితులు చేజారిపోతున్న సమయంలో మొత్తానికి సర్దుబాటు జరిగింది. నిర్మాతగా తమకు నచ్చిన వారితో షూటింగ్ చేసుకుంటామని చెర్రీ చెప్పిన దానికి ఫెడరేషన్ నాయకులు అంగీకరించలేదు. ఇది జరిగిన కొద్ది గంటలలోనే తెలుగు ఫిల్మ్ ఛాంబర్ నుండి ఇదే అంశాన్ని ప్రస్తావిస్తూ ఓ లేఖ విడుదలైంది. ఏ నిర్మాత అయినా తమకు నచ్చిన వారితో పని చేసుకోవచ్చునంటూ ఆ లేఖలో పేర్కొన్నారు. ఇదిలా ఉంటే... సోమవారం రాత్రి తమ సినిమా తాజా షెడ్యూల్ పూర్తి అయినట్టుగా దర్శకుడు హరీశ్‌ శంకర్ ఎక్స్ లో ఓ పోస్ట్ పెట్టారు. మూవీ సెట్ లో పవన్ కళ్యాణ్ తో దిగిన ఫోటోను పెడుతూ, 'మాటిస్తే నిలబెట్టుకోవడం, మాట మీదే నిలబడ్డం... మీరు పక్కనుంటే కరెంటు పాకినట్టే' అంటూ ఆ పోస్ట్ లో హరీశ్‌ శంకర్ పేర్కొన్నాడు.

s.jpg


అయితే ముందుగా అనుకున్న పాట చిత్రీకరణ ఏ మేరకు పూర్తయ్యింది? దానిని వచ్చే షెడ్యూల్ కు పోస్ట్ పోన్ చేశారా? అనే విషయాన్ని అందులో పేర్కొనలేదు. ఏదైమైనా 'ఉస్తాద్ భగత్ సింగ్' సినిమాకూ సమ్మె పోటు తప్పలేదనిపిస్తోంది. ఏపీ డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్‌ బాధ్యతలు స్వీకరించిన తర్వాత విడుదలైన తొలి చిత్రంగా 'హరిహర వీరమల్లు' (Hari Hara Veera Mallu) నిలువగా మలి చిత్రంగా 'ఓజీ' (OG) సెప్టెంబర్ 25న విడుదల కాబోతోంది. తాజాగా 'ఓజీ' సినిమా నుండి వచ్చిన పాట సోషల్ మీడియాలో సందడి చేస్తోంది.

Also Read: Paranthu Po OTT: ఓటీటీకి వ‌చ్చేసిన‌.. త‌మిళ తండ్రీ, కొడుకుల ఎమోష‌న‌ల్ రైడ్‌! ప్ర‌తి పేరెంట్ చూడాల్సిందే

Also Read: Janaki vs State of Kerala: అదిరిపోయే కోర్టు రూమ్ డ్రామా.. తెలుగులోనూ ఓటీటీకి వ‌చ్చేస్తోంది..

Updated Date - Aug 05 , 2025 | 01:29 PM