Janaki vs State of Kerala: అదిరిపోయే కోర్టు రూమ్ డ్రామా.. తెలుగులోనూ ఓటీటీకి వచ్చేస్తోంది.
ABN , Publish Date - Aug 05 , 2025 | 07:03 AM
కేంద్ర మంత్రి సురేష్ గోపి, అనుపమా పరమేశ్వరన్ లీడ్ రోల్స్‌లో నటించిన చిత్రం 'జానకి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ’.
చాలా కాలం తర్వాత మలయాళ నటుడు, కేంద్ర మంత్రి సురేష్ గోపి(Suresh Gopi), అనుపమా పరమేశ్వరన్ (Anupama Parameswaran) లీడ్ రోల్స్‌లో నటించిన చిత్రం 'జానకి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ’ (Janaki vs State Of Kerala) (జె.ఎస్.కె). ప్రవీణ్ నారాయణ దర్శకత్వం వహించాడు.కేరళలో జరిగిన యదార్థ సంఘటనల ఆధారంగా ఇంటెన్స్ కోర్టు డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రంలో బైజు సంతోష్, మాధవ్ సురేష్ గోపి, దివ్య పిళ్లయి ప్రధాన పాత్రల్లో నటించారు. సినిమా విడుదలకు ముందే అనేక అవాంతరాలను ఎదుర్కొన్న ఈ చిత్రం వాటినన్నింటిని అధిగమించి జూలై 17న మలయాళంలో థియేటర్లలో విడుదలై ఫర్వాలేదనిపించుకుంది. ఇప్పుడు డిజిటల్ స్ట్రీమింగ్‌కు రెడీ అయింది.
కథ విషయానికి వస్తే.. బెంగళూరులో ఐటీ జాబ్ చేసుకునే జానకి విధ్యాదరణ్ ఓ ఫ్యామిలీ ఫంక్షన్ నిమిత్తం కేరళకు వస్తుంది. ఓ రోజు అరాత్రి అక్కడ తనకు జరిగిన ఘటన ఆమె జీవితాన్ని తలకిందులు చేస్తుంది. దీంతో న్యాయం కావాలంటూ కోర్టును ఆశ్రయించిన ఆమెకు అక్కడ కఠిన పరిస్థితులు ఎదురవుతాయి. ఆ సమయంలో ఆడ్వకేట్ డేవిడ్ అబెల్ డోనోవన్ రాకతో మరో మలుపు తీసుకుంటుంది. జానకి తనకు జరిగిన అన్యాయాన్ని అడ్వకేట్‌తో కలిసి ఎలా ఎదుర్కొంది, మన న్యాయ వ్యవస్థ ఎలా ఉందనే ఆసక్తికర పాయింట్లను టచ్ చేస్తూ మూవీ సాగుతుంది.
ఇదిలాఉంటే.. సినిమా టైటిల్‌లో సీతా దేవికి మరో పేరైన జానకి ఉండడంపై సెన్సార్ బోర్టు అభ్యంతరం వ్యక్తం చేసి సర్టిఫికెట్ నిరాకరించడం, ఆపై సినిమా స్టోరి, హెడ్డింగ్‌కి తగ్గట్టుగా కేరళ హైకోర్టు (Kerala High Court) వరకూ వెళ్లి ఈ చిత్రం పెద్ద చర్చకే దారి తీసింది. దాంతో జూన్ 27న విడుదల కావాల్సిన సినిమా కాస్త జూలై 17న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సమయంలో తెలుగులోనూ డబ్బింగ్ చేసి రెండు భాషల్లో ఒకేసారి విడుదల చేస్తు్ననట్లు మేకర్స్ ప్రకటించి ట్రైలర్‌కూడా రిలీజ్ చేశారు. అయితే.. మలయాళంతో పాటే తెలుగులోనూ విడుదల కావాల్సిన ఈ చిత్రం వాయిదా పడి ఈ వారం ఆగస్టు 8న రెండు తెలుగు రాష్ట్రాల థియేటర్లలో రిలీజ్ అవనుంది. అయితే ఆ తర్వాత ఆరు రోజుల్లోనే ఓటీటీకి సైతం వస్తుండడం విశేషం.
అయితే ఇప్పటికే ఎన్నో సార్లు మనం చూసిన రొటీన్ కథలానే ఎక్కడా కొత్తదనం లేకుండా ఈ సినిమా సాగడం కాస్త బోర్ ఫీల్ వస్తుంది. ఎక్కడా ఎలాంటి అభ్యంతరకర సన్నివేశాలు లేవు మూవీని కుటుంబంతో కలిసి చూసేయవచ్చు. ఆగస్టు 15 నుంచి జీ5 (Zee 5)లో మలయాళంతో పాటు తెలుగు ఇతర భాషల్లోనూ స్ట్రీమింగ్‌కు రానుంది. ఓటీటీ ప్రియులు ఈ జానకి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ (Janaki vs State Of Kerala) సినిమాను మస్ట్‌గా వాచ్ లిస్టులో యాడ్ చేసుకోవచ్చు. థియేటర్లలో మిస్సయిన వారు, అనుపమ, సురేశ్ గోపి ఫ్యాన్స్ తప్పక చూడాల్సిన సినిమా ఇది.