Paranthu Po OTT: ఓటీటీకి వచ్చేసిన.. తమిళ తండ్రీ, కొడుకుల ఎమోషనల్ రైడ్! ప్రతి పేరెంట్ చూడాల్సిందే
ABN , Publish Date - Aug 05 , 2025 | 09:56 AM
గత నెల జూలై4న థియేటర్లకు వచ్చి పాజిటివ్ టాక్ తెచ్చుకుని ఓ మోస్తరు విజయం సాధించిన తమిళ చిత్రం పరంతు పో.
గత నెల జూలై4న థియేటర్లకు వచ్చి పాజిటివ్ టాక్ తెచ్చుకుని ఓ మోస్తరు విజయం సాధించిన తమిళ చిత్రం పరంతు పో (Paranthu Po). ఈ టైటిల్‌కు అర్థం ఎగిరి పో అని. శివ (Shiva), మిథుల్ ర్యాన్ (Mithul Ryan), మలయాళ నటి గ్రేస్ అంటోని (Grace Antony), అజు వర్గీస్ (Aju Varghese), అంజలి (Anjali) ప్రధాన పాత్రలు పోషించారు. యువన్ శంకర్ రాజా నేపథ్య సంగీతం అందించగా రామ్ దర్శకత్వం వహించాడు. పైర్తిగా రోడ్ ట్రిప్ జర్నీ గా సాగే ఈ చిత్రం రిలీజ్‌కు ముందు నుంచే మంచి హైప్ తెచ్చుకోగా అంతర్జాతీయ చిత్రోత్సవాల్లోనూ ప్రదర్శితమవడం విశేషం. ఇప్పుడీ సినిమా మంగళవారం నుంచే డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చేసింది.
కథ విషయానికి వస్తే.. నగరంలో పెరిగిన ఎనిమిదేళ్ల బాలుడు అన్బు. తండ్రి గోకుల్, తల్లి గ్లోరీ తమ కుమారుడికి మంచి భవిష్యత్తు అందించాలని రేయింభవళ్లు కష్ట పడుతుంటారు. ఈ క్రమంలో ఎన్ని పని ఒత్తిడులు, ఈఎంఐ సమస్యల్లోనూ తలమునకలై జీవితం సాగిస్తుంటారు. వారు చిన్న చిన్న జీతాలకు పని చేస్తూ అన్బును లక్షలు పెట్టి పెద్ద పాఠశాలలో చదివిస్తుంటారు. తల్లి గ్లోరీ చీరలు అమ్మేందుకు మరో ప్రాంతం వెళ్లడం, తండ్రి తన డెలివరీ సర్వీస్ పనుల్లో బిజీగా ఉంటారు. అయితే.. వరుస సెలవుల వళ్ల ఎక్కువగా ఇంట్లోనే ఉండాల్సి రావడంతో ఎంతో చలాకీగా, ఎలాంటి భయం లేకుండా ఉండే అన్బు లోన్లీగా ఫీల్ అవుతుంటాడు.
దీంతో బాగా ఒంటరితనం ఫీలవుతన్నట్లు గుర్తించిన తండ్రి గోకుల్ కొడుకు అన్బును బండిపై బయటకు తీసుకెళతాడు. ఈ నేపథ్యంలో వారికి ఏ పరిస్థితులు ఎదురయ్యాయి, ఎలాంటి కొత్త అనుభవాలు ఫేస్ చేయాల్సి వచ్చింది, కొత్తగా నేర్చుకున్న పాఠాలేంటి అనే కథకథనాలతో భావోద్వేగ సన్నివేశాలతో ఫ్యామిలీ ఆడియెన్స్‌ను హత్తుకునేలా సినిమా సాగుతుంది. ముఖ్యంగా తన కుమారుడితో కలిసి తిరుగుతున్న సమయంలో తనకు తన తండ్రితో ఉన్న అనుంబంధం గుర్తుకు వచ్చే సీన్లు బావుంటాయి.
ఇప్పుడీ పరంతు పో (Paranthu Po) సినిమా జియో హాట్ స్టార్ (Jio Hotstar) ఓటీటీలో తమిళంతో పాటు తెలుగు ఇతర భాషల్లోనూ స్ట్రీమింగ్ అవుతోంది. మంచి ఫ్యామిలీ డ్రామా, తండ్రీ కొడుకుల ఎమోషనల్, ఫన్నీ జర్నీ చూడాలనుకునే వారు ఈ సినిమాను ఏం చక్కా చూసేయవచ్చు. అయితే ఇది కుటుంబ ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అవుతుంది. యూత్‌కు మాత్రం గజిబిజీ చిత్రం అనిపించక తప్పదు.