సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Jana Nayagan: సంక్రాంతికి జన నాయకుడు ఉన్నట్టా.. లేనట్టా

ABN, Publish Date - Oct 24 , 2025 | 05:05 PM

ఎన్నో పొంగల్ మూవీ వార్స్ లో విజేతగా నిలచిన మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) తన కెరీర్ లో హీరోగా 16వ సారి సంక్రాంతి సంబరాల్లో పాలు పంచుకుంటున్నారు.

Jana Nayagan

Jana Nayagan: ఈసారి సంక్రాంతి సంబరాలు భలే రంజుగా ఉన్నాయనే చెప్పాలి. సీనియర్ స్టార్ - యంగ్ స్టార్స్ - అప్ కమింగ్ స్టార్స్ అందరూ బరిలో దూకుతున్నారు. ఎన్నో పొంగల్ మూవీ వార్స్ లో విజేతగా నిలచిన మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) తన కెరీర్ లో హీరోగా 16వ సారి సంక్రాంతి సంబరాల్లో పాలు పంచుకుంటున్నారు. 70 ఏళ్ళ ఈ సీనియర్ స్టార్ సంక్రాంతి సంబరాల్లో దూకడమే ఓ విశేషంగా ముచ్చటించుకుంటున్నారు ఫ్యాన్స్. ఇక 'ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్' ట్యాగ్ ను సొంతం చేసుకున్న ప్రభాస్ (Prabhas)'ద రాజాసాబ్ (The Rajasaab)'తో పొంగల్ వార్ కు సై అంటున్నారు. ప్రస్తుతానికి వీరిద్దరి సినిమాలపైనే అందరి చూపూ సాగుతోంది. వీరితో పాటు రవితేజ కూడా బరిలో నిలవనున్నారు. 'నారీ నారీ నడుమ మురారి'తో శర్వానంద్, 'అనగనగా ఒకరాజు'తో నవీన్ పోలిశెట్టి సైతం సంక్రాంతి సంబరాల్లో పాలు పంచుకుంటున్నారు... పొంగల్ సీజన్ కే వస్తోన్న విజయ్ డబ్బింగ్ మూవీ 'జననాయకుడు' చోటు ఎక్కడ ఉంటుందని కొందరి ప్రశ్న.


ఐదు స్ట్రెయిట్ తెలుగు మూవీస్, ఓ డబ్బింగ్ సినిమా వెరసి ఆరు సినిమాలు సంక్రాంతినే ఎంచుకున్నాయి... అయితే వీటిలో ముందుగా ప్రభాస్ హీరోగా మారుతి తెరకెక్కించిన 'ద రాజాసాబ్' జనవరి 9న వెలుగు చూడనుంది... అదే రోజున విజయ్ 'జననాయకుడు' కూడా రానుంది. కానీ, కొన్ని రోజుల నుంచి జన నాయకుడు రిలీజ్ వాయిదా పడిందని వార్తలు వినిపిస్తున్నాయి. విజయ్ ప్రచార సభలో జరిగిన విచారకరమైన సంఘటన వలన ఈ సినిమాను కొన్నిరోజులు ఆపాలని ప్రయత్నిస్తున్నారని అప్పట్లో వార్తలు వచ్చాయి. అందుకే ఇప్పటికీ కూడా ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ మొదలుపెట్టలేదని టాక్.


ఇంకొంతమంది మాత్రం కచ్చితంగా విజయ్ అనుకున్న సమయానికే వస్తారు అని అంటున్నారు. ఆ ఘటనను ప్రజలు నెమ్మదిగా మర్చిపోతున్నారు.. జనవరి 9 మంచి డేట్. ప్రభాస్ తో పోటీ ఉన్నా కూడా తమిళ్ లో విజయ్ కు మంచి ఫ్యాన్ బేస్ నే ఉంది. కథ కొంచెం ప్రేక్షకులకు నచ్చితే ఇక ఆ సినిమాను ఆపేవారు ఉండరు. మిగతా చిన్న సినిమాలు వచ్చినా విజయ్ ను సినిమాకు మంచి థియేటర్స్ దొరుకుతాయి. తమిళ్ విషయం పక్కన పెడితే తెలుగులోనే జన నాయకుడు పోటీని తట్టుకోవాలి. అసలు ఈ సినిమా ఈ పోటీలో ఉంటుందా లేదా అనేది కూడా క్లారిటీ రావాల్సి ఉంది. మరి ప్రభాస్- విజయ్ లో ఎవరు గెలుస్తారు అనేది చూడాలంటే కొన్ని రోజులు వేచి ఉండాల్సిందే.

Akhanda 2: సౌండ్ కంట్రోల్లో పెట్టుకో.. బాలయ్య తాండవం మొదలు

Upasana Konidela: మెగా ఫ్యామిలీ ‘డబుల్‌’ సెలబ్రేషన్స్‌.. అల్లు ఫ్యామిలీ ఎక్కడ

Updated Date - Oct 24 , 2025 | 05:51 PM