Akhanda 2: సౌండ్ కంట్రోల్లో పెట్టుకో.. బాలయ్య తాండవం మొదలు
ABN , Publish Date - Oct 24 , 2025 | 05:24 PM
నందమూరి ఫ్యాన్స్ కు బోయపాటి శ్రీను (Boyapati Srinu) సడెన్ సర్ ప్రైజ్ ఇచ్చాడు. ఎలాంటి అప్డేట్ లేకుండా అఖండ 2 తాండవం (Akhanda 2 Thaandavam) నుంచి బ్లాస్టింగ్ రోర్ అనే పేరుతో ఒక గ్లింప్స్ ను రిలీజ్ చేశారు.
Akhanda 2: నందమూరి ఫ్యాన్స్ కు బోయపాటి శ్రీను (Boyapati Srinu) సడెన్ సర్ ప్రైజ్ ఇచ్చాడు. ఎలాంటి అప్డేట్ లేకుండా అఖండ 2 తాండవం (Akhanda 2 Thaandavam) నుంచి బ్లాస్టింగ్ రోర్ అనే పేరుతో ఒక గ్లింప్స్ ను రిలీజ్ చేశారు. నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం అఖండ. ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్ గా అఖండ 2 ను బోయపాటి మొదలుపెట్టిన విషయం తెల్సిందే. 14 రీల్స్ బ్యానర్ పై రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా.. బాలయ్య కుమార్తె తేజస్విని ఈ సినిమాను సపర్పిస్తుంది.
ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. అన్ని బావుంటే.. సెప్టెంబర్ లోనే అఖండ 2 రిలీజ్ అయ్యేది. కానీ, కొన్ని కారణాల వలన ఈ చిత్రం వాయిదా పడింది. ఇక ఎప్పటి నుంచో అఖండ 2 డిసెంబర్ 5 న రిలీజ్ అవుతుంది అని వార్తలు వినిపిస్తున్నాయి. ఆ వార్తలను నిజం చేస్తూ నేడు అఖండ 2 డిసెంబర్ 5 నే రిలీజ్ అవుతుందని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. దీంతో పాటు ఓకే చిన్న గ్లింప్స్ ను కూడా రిలీజ్ చేశారు. పోయినసారి ప్రళయాన్ని చూపించిన బోయా.. ఈసారి ప్రకృతిని పరిచయం చేశాడు.
ఇక ఈ వీడియోలో రెండో బాలయ్య యాక్షన్ తో అదరగొట్టేశాడు. సౌండ్ తగ్గించుకో.. ఏ సౌండ్ కు నవ్వుతానో.. ఏ సౌండ్ కు నరుకుతానో.. నాకే తెలియదు కొడకా. ఊహకు కూడా అందదు అని బాలయ్య చెప్పే డైలాగ్ అయితే నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు. ప్రస్తుతం ఈ గ్లింప్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మరి ఈ సినిమాతో బాలయ్య - బోయా ఎలాంటి రికార్డులు సృష్టిస్తారో చూడాలి.
Karan Johar: 26 ఏళ్ల వయస్సులో నా వర్జినిటీ కోల్పోయాను..
Upasana Konidela: మెగా ఫ్యామిలీ ‘డబుల్’ సెలబ్రేషన్స్.. అల్లు ఫ్యామిలీ ఎక్కడ