Spirit: ప్రభాస్ న్యూడ్ గా కనిపిస్తే ఫ్యాన్స్ ఒప్పుకుంటారా..
ABN , Publish Date - Nov 03 , 2025 | 04:55 PM
ప్రస్తుతం ఆల్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సూపర్ స్టార్ గా జేజేలు అందుకుంటున్న ప్రభాస్ (Prabhas) ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారాడు. డార్లింగ్ నటిస్తున్న చిత్రాల్లో 'స్పిరిట్ (Spirit)' ఒకటి.
Spirit: ప్రస్తుతం ఆల్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సూపర్ స్టార్ గా జేజేలు అందుకుంటున్న ప్రభాస్ (Prabhas) ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారాడు. డార్లింగ్ నటిస్తున్న చిత్రాల్లో 'స్పిరిట్ (Spirit)' ఒకటి. సందీప్ రెడ్డి వంగా (Sndeep Reddy Vanga)దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో ప్రభాస్ సరసన త్రిప్తి డిమ్రి(Tripti Dimri) నటిస్తోంది. ఈ సినిమా మొదలైనప్పటి నుంచి ఓ రేంజ్ లో హైప్ ను క్రియేట్ చేస్తూ వచ్చింది. ఈ మధ్య రిలీజ్ అయిన ఆడియో గ్లింప్స్ తో మరింత హైప్ ను తెచ్చుకుంది, అయితే గత కొన్నిరోజుల నుంచి స్పిరిట్ కు సంబంధించిన ఒక వార్త సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. ఈ చిత్రంలో ప్రభాస్ బోల్డ్ సీన్స్ లో నటించనున్నాడట.. బోల్డ్ అంటే హీరోయిన్ తో బోల్డ్ కాదు.. న్యూడ్ సీన్స్ లో కనిపించనున్నాడని టాక్.
ప్రభాస్ న్యూడ్ గా నటిస్తాడు అనగానే ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. సందీప్ రెడ్డి వంగాను అభిమానులు ఆడిపోసుకుంటున్నారు. బావుంటే ఓకే.. ఏదైనా తేడా కొట్టింది అంటే ట్రోల్స్ మాములుగా రావు. అందుకే ఫ్యాన్స్ ఎక్కువ ఆలోచిస్తున్నారు. కొందరు ఆ సీన్ ఎడిటింగ్ లో ఉంటుందా? సెన్సార్ కత్తెరకు బలికాకపోతుందా? అనీ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఆ సీన్ లో ప్రభాస్ నటించక పోయినా 'బాడీ డబుల్'తో చిత్రీకరిస్తారనీ ఇంకొందరి మాట. ఇలా పలు విధాలా చర్చకు దారితీస్తోంది 'స్పిరిట్' మూవీ.
అసలు 'స్పిరిట్' మూవీ షూటింగ్ మొదలు కాకుండానే ఇలా చర్చనీయాంశం కావడం విశేషం! ఆ సినిమాపై ఆరంభం నుంచీ అభిమానుల్లో ఆసక్తి కలిగించడానికే 'ప్రభాస్ న్యూడ్ గా నటిస్తాడు' అన్న అంశాన్ని లేవనెత్తారనీ సినీజనం అంటున్నారు. పోలీస్ స్టేషన్ లో హీరోని ఇంటరాగేషన్ చేసే సమయంలో వచ్చే సీన్ అది అని చెబుతున్నారు. 40 ఏళ్ళ క్రితం సిల్వెస్టర్ స్టాలోన్ నటించిన 'ఫస్ట్ బ్లడ్'లో పోలీస్ స్టేషన్ లో ఓ ఇంటరాగేషన్ సీన్ ఉంటుంది. అందులో హీరోను ఇలాగే న్యూడ్ గా చూపిస్తారు. ఇప్పుడు ఆ సన్నివేశాన్ని గుర్తు చేసుకొంటున్నారు కొందరు సినీ ఫ్యాన్స్. మరి ప్రభాస్ ను వంగా ఏం చేస్తాడో ఏమో చూడాలి.
Prabhas Vs Shahrukh: అసలైన కింగ్ ఎవరు.. ?
Devi Sri Prasad: పెళ్లి.. హీరో ఛాన్స్.. దేవిశ్రీ ప్రసాద్ ఓటు దేనికి..