Prabhas Vs Shahrukh: అసలైన కింగ్ ఎవరు.. ?
ABN , Publish Date - Nov 03 , 2025 | 03:45 PM
జనరేషన్ మారుతున్నప్పుడు కొత్త రక్తం వస్తూ ఉంటుంది. వారిని ఎంకరేజ్ చేసినంత మాత్రాన సీనియర్లను వదిలేసినట్లు కాదు.
Prabhas Vs Shahrukh: జనరేషన్ మారుతున్నప్పుడు కొత్త రక్తం వస్తూ ఉంటుంది. వారిని ఎంకరేజ్ చేసినంత మాత్రాన సీనియర్లను వదిలేసినట్లు కాదు. ఇండస్ట్రీలో కూడా సీనియర్ హీరోలు, కుర్ర హీరోల విషయంలో కూడా అంతే. వారికి లేని ఆలోచనలను కొంతమంది కావాలని జెలసీతో ఫ్యాన్స్ లో రెచ్చగొడుతూ వివాదాలు సృష్టిస్తున్నారు. బాలీవుడ్ డైరెక్టర్ సిద్దార్థ్ ఆనంద్ అదే పని చేశాడు అంటే నిజమే అన్న మాట వినిపిస్తుంది.
గత కొంతకాలంగా తెలుగు సినిమాలకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు లభిస్తుంది. తెలుగు, తమిళ్, హిందీ అని భాషతో తేడా లేకుండా అందరూ కలిసి సినిమాలు తెరకెక్కిస్తున్నారు. ముఖ్యంగా బాలీవుడ్ ను ఏలుతున్న తెలుగు డైరెక్టర్స్ లో సందీప్ రెడ్డి వంగా ఒకరు. కబీర్ సింగ్, యానిమల్ సినిమాలతో బాలీవుడ్ దశను మార్చేశాడు. దాన్ని సిద్దార్థ్ ఆనంద్ జీర్ణించుకోలేకపోయాడనిపిస్తుంది. అందుకే అతనికి కౌంటర్ ఇవ్వడానికే కింగ్ సినిమాను తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది.
సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా స్పిరిట్ తెరకెక్కుతున్న విషయం తెల్సిందే. ఈ మధ్యనే డార్లింగ్ పుట్టినరోజున ఒక ఆడియో గ్లింప్స్ ను రిలీజ్ చేశాడు. అందులో ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ అని చెప్పుకొచ్చాడు. ఇక అది నచ్చకో .. లేక సందీప్ .. దీపికా విషయంలో చేసిన పనికో తెలియదు కానీ, ఆ మాటకు కౌంటర్ గా షారుఖ్ ఖాన్ తో కింగ్ అనే సినిమాను ప్రకటించాడు సిద్దార్థ్ ఆనంద్. కింగ్ పేరుతో సినిమా తీయడం, షారుఖ్ హీరో కావడం ఇక్కడ సమస్య కాదు.. షారుఖ్ ను ఉద్దేశిస్తూ.. ఆయనే ఇండియా సూపర్ స్టార్ కంటే పెద్ద కింగ్ అన్నట్లు చెప్పడం వివాదానికి దారి తీసింది. అంతేకాకుండా ప్రభాస్ సాహో సినిమాలోని ఇట్స్ షో టైమ్ అనే డైలాగ్ ను కూడా కాపీ కొట్టించడం మరింత వివాదానికి దారితీసింది.
ప్రస్తుతం సోషల్ మీడియాలో అసలు కింగ్ ఎవరు.. ? ఇండియా సూపర్ స్టార్ ఎవరు..? అని ఫ్యాన్స్ వాదులాడుకుంటున్నారు. ఇక ఈ విధంగా చెప్పాలన్నా.. ఇద్దరి జనరేషన్లు వేరు. ఇద్దరి ట్రాక్ రికార్డ్స్ వేరు.. వారిద్దరిని పోల్చడం కూడా సరికాదు. ఆ లెక్కన చెప్పాలంటే.. పెద్ద ఎన్టీఆర్ ని, చిరంజీవిని పోల్చగలమా.. ఆయన జనరేషన్ కు ఆయన గొప్ప.. ఈయన జనరేషన్ కు ఈయన గొప్ప. షారుఖ్ వయస్సు రీత్యా అప్పటి సీనియర్లతో.. ఇప్పటి జూనియర్లతో నటిస్తున్నాడు. ప్రభాస్ వయస్సు, అనుభవం రీత్యా ఈ జనరేషన్ వాళ్లతో నటిస్తున్నాడు. గుర్తింపు ఇద్దరికీ సమానమే. వయస్సు, అనుభవం, లెగసీ ఇద్దరిది వేరు వేరు.. అది గుర్తించాలి.
టీవీలో చిన్న చిన్న పాత్రలు చేస్తూ.. అంచలంచలుగా ఎదిగి కింగ్ ఖాన్ స్థానానికి చేరుకోవడం అంటే మాములు విషయం కాదు. అలాగే.. నట వారసుడిగా అడుగుపెట్టినా కూడా తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకొని పాన్ ఇండియా హీరోగా ఎదగడం కూడా మాములు విషయం కాదు. అన్ని విషయాల్లో ఇద్దరూ గొప్పవారే. ఎవరు ప్రాముఖ్యత వారికి ఉంది. ఇద్దరు హీరోల సినిమాలు ప్రపంచవ్యాప్తంగా ఆదరణ పొందుతున్నాయి. ఇలా ఒకరిని ఇంకొకరితో పోల్చడం.. వేరొక డైరెక్టర్ పై కక్ష కట్టినట్లు కౌంటర్లు ఇవ్వడం మానేసి.. మంచి మంచి కథలతో ప్రేక్షకులను మెప్పించడం నేర్చుకుంటే బావుంటుందని నెటిజన్స్ సిద్దార్థ్ ఆనంద్ కు సలహాలు ఇస్తున్నారు.
Shah Rukh Khan King: కొత్త లుక్‌లో.. షారుఖ్! ‘కింగ్’ గ్లింప్స్ వచ్చేసింది
Deekshith Shetty: 'ది గర్ల్ ఫ్రెండ్' వెనుకే మరో సినిమా...