Devi Sri Prasad: పెళ్లి.. హీరో ఛాన్స్.. దేవిశ్రీ ప్రసాద్‌ ఓటు దేనికి..

ABN , Publish Date - Nov 03 , 2025 | 03:45 PM

జగపతిబాబు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ‘జయమ్ము నిశ్చయమ్ము రా’ టాక్‌ షోలో మ్యూజిక్‌ మిసైల్‌ దేవిశ్రీ ప్రసాద్‌ సందడి చేశారు. జగపతి బాబు అడిగిన ర్యాపిడ్‌ ఫైర్‌కు డీఎస్పీ ఆసక్తికర సమాధానాలు చెప్పారు.


జగపతిబాబు (Jagapathibabu) వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ‘జయమ్ము నిశ్చయమ్ము రా’ (Jayammu Nischayammu Raa) టాక్‌ షోలో మ్యూజిక్‌ మిసైల్‌ దేవిశ్రీ ప్రసాద్‌ (Devisri prasad)సందడి చేశారు. జగపతి బాబు అడిగిన ర్యాపిడ్‌ ఫైర్‌కు డీఎస్పీ ఆసక్తికర సమాధానాలు చెప్పారు. అలాగే ‘అత్తారింటికి దారేది’ సినిమాలో ‘నిన్ను చూడగానే చిట్టి గుండె’ సాంగ్‌ను సరదాగా రోడ్డు మీద నడిచేటప్పుడు రాసినట్లు ఆయన చెప్పారు. తన ఎనర్జీని మ్యాచ్‌ చేసే హీరో చిరంజీవి అని చెప్పారు. ఆయన ఎనర్జీ మరో లెవల్‌ అనీ, దాన్ని వర్ణించలేమని అన్నారు దేవి. తన పాటల్లో ఖడ్గంలోని ‘నువ్వు నువ్వు’ సాంగ్‌ ఎంతో ఫేమస్‌ అని,  ప్రేమను వ్యక్తపరచడానికి ఆ పాటనే ఎక్కువగా ఉపయోగించుకుంటారని దేవి చెప్పారు.  
 
ఇంకా ఆయన మాట్లాడుతూ ‘మ్యూజిక్‌ డైరెక్టర్‌ కావాని కలలు కన్నప్పటి నుంచి నా పాటకు చిరంజీవి డ్యాన్స్‌ ఎప్పుడు వేస్తారా అని ఎదురుచూశాను. ఇప్పటికీ చిరంజీవి నా పాటకు డ్యాన్స్‌ వేస్తే ఆశ్యర్యపోయి చూస్తుంటాను.

ఫస్ట్‌ హీరో అవుతావా..? పెళ్లి చేసుకుంటావా?
పెళ్లి చేసుకుంటావా? అనే ఆప్షన్‌ పక్కన ఏది పెట్టినా ఆ ఆప్షన్నే అంగీకరిస్తాను. అందుకే మీ ప్రశ్నకు సమాధానం ముందు హీరో అవుతాను. చాలా స్ర్కిప్ట్‌లు వస్తున్నాయి. ఏదైనా కథ నాకు నచ్చితే దానికి ఓకే చెబుతాను.

కెరీర్‌లో మర్చిపోలేని సంఘటన?

మనం ఏదైనా బలంగా కోరుకుంటే అది నెరవేరుతుందని నేను నమ్ముతా. నాకు ఇళయరాజా దేవుడితో సమానం. ఒక్కసారైనా ఆయన్ని చూడాలి అనుకునేవాడిని. అలాంటిది గతేడాది ఆయన నా స్టూడియోకు వచ్చారు. ఆరోజును ఎప్పటికీ మర్చిపోలేను.

కంపోజింగ్‌కు ఎక్కువ సమయం తీసుకున్న పాట ఏది?  
ఆర్య సినిమాలో ‘అ అంటే అమలాపురం..’ అంతకుముందు ‘వంగతోట మలుపు కాడా..’ అనే పాట కంపోజ్‌ చేశాను. ఆ సాంగ్‌ విని సుకుమార్‌ అలాంటి పాటే కావాలన్నారు. ఆ రెండూ సూపర్‌ హిట్‌ అయ్యాయి.

మీ విషయాలను ఎవరితో షేర్‌ చేసుకుంటారు?

నాకు సోదర సమానుడైన సుకుమార్‌తో..  


Updated Date - Nov 03 , 2025 | 03:46 PM