సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Kalki 2: దీపికా ప్లేస్ లో అలియా.. ప్రభాస్ పక్కన సెట్ అవుతుందా

ABN, Publish Date - Oct 11 , 2025 | 08:36 PM

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) నటించిన కల్కి 2898 ఏడి (Kalki 2898 AD) సినిమా భారీ విజయాన్ని అందుకున్న విషయం తెల్సిందే.

Kalki 2

Kalki 2: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) నటించిన కల్కి 2898 ఏడి (Kalki 2898 AD) సినిమా భారీ విజయాన్ని అందుకున్న విషయం తెల్సిందే. నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని వైజయంతీ మూవీస్ నిర్మించింది. ఇక ఈ చిత్రంలో దీపికా పదుకొనే హీరోయిన్ గా నటించింది. కల్కి కి సీక్వెల్ ఉందని మేకర్స్ ఎప్పటి నుంచో ప్రకటించారు. ఈ మధ్యనే అధికారికంగా కూడా కల్కి 2 పట్టాలెక్కనుందని తెలిపారు. ఇక ఈ నేపథ్యంలోనే కొన్ని కారణాల వలన కల్కి 2 నుంచి దీపికాను తొలగించినట్లు మేకర్స్ ప్రకటించారు.


దీపికాను తొలగించడం వెనుక చాలా కారణాలు ఉన్నాయి. అవి చాలామందికి కూడా తెలుసు. ఇక అదంతా పక్కన పెడితే.. దీపికా స్థానాన్ని భర్తీ చేసే మరో ముద్దుగుమ్మ ఎవరు..? గత కొన్ని రోజులుగా ఇదే వార్త సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. ఇక తాజాగా ఆ ముద్దుగుమ్మ అలియా భట్ అని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. దీపికా స్థానానికి అలియా అయితే పర్ఫెక్ట్ అని మేకర్స్ ఆమెను సంప్రదించారని టాక్.


అలియా అనేసరికి ప్రభాస్ ఫ్యాన్స్ పెదవి విరుస్తున్నారు. ఆరడుగుల ప్రభాస్ పక్కన దీపికానే చిన్నగా కనిపించింది. ఇప్పుడు అలియా అయితే మరీ పొట్టిగా కనిపిస్తుంది. అసలు డార్లింగ్ పక్కన అలియా కనిపిస్తుందా.. ? అని మాట్లాడుకుంటున్నారు. మొదటి పార్ట్ లో ప్రభాస్ - దీపికా మధ్య సీన్స్ లేవు. సెకండ్ పార్ట్ లో కచ్చితంగా ఆ రెండు పాత్రల మధ్య కీలక సన్నివేశాలు ఉంటాయని చెప్పుకొచ్చారు. ఇక ఇప్పుడు అలియా అయితే మరీ ప్రభాస్ ముందు చిన్నపిల్లలా ఉంటుందేమో అని అంటున్నారు. ఆమె పల్స్ లో అనుష్కనో, ఐశ్వర్య రాయ్ నో తీసుకుంటే బావుంటుందని చెప్పుకొస్తున్నారు. మరి ఇందులో ఎంతవరకు నిజముంది అనేది తెలియాల్సి ఉంది.

Raashii Khanna: తెలుసు కదా యూనిక్ సబ్జెక్ట్

K Ramp Trailer: అదిరిపోయిన కె ర్యాంప్ ట్రైలర్.. రొమాన్స్ నెక్స్ట్ లెవెల్ అంతే

Updated Date - Oct 11 , 2025 | 08:36 PM