Venkitesh: ఒక్క స్పీచ్ తో ఓవర్ నైట్ స్టార్ గా మారాడు.. ఎవరీ కుర్రాడు
ABN, Publish Date - Jul 29 , 2025 | 05:49 PM
ఇండస్ట్రీలో ఎవరు ఎప్పుడు పైకి ఎదుగుతారు... ఎవరు ఎప్పుడు కిందకు పడతారు అని చెప్పడం చాలా కష్టం.
Venkitesh: ఇండస్ట్రీలో ఎవరు ఎప్పుడు పైకి ఎదుగుతారు... ఎవరు ఎప్పుడు కిందకు పడతారు అని చెప్పడం చాలా కష్టం. అసలు ఎవరూ ఉహించనివారు ఓవర్ నైట్ స్టార్స్ గామారినవారు చాలా ఉన్నారు. తాజాగా కింగ్డమ్ (Kingdom) ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఒక స్టార్ పుట్టుకొచ్చాడు. అతడే వెంకీటేష్. ఎవరీ వెంకీటేష్ (Venkitesh).. ? గతరాత్రి నుంచి సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ఈ కుర్రాడి బ్యాగ్ గ్రౌండ్ ఏంటి.. ? అని నెటిజన్స్ ఆరాలు తీయడం మొదలుపెట్టారు.
వెంకిటేష్ విపి.. ఒక మలయాళ నటుడు. సీరియల్స్ తో కెరీర్ ను ప్రారంభించిన వెంకిటేష్ .. ఆ తరువాత నెమ్మదిగా సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేస్తూ పేరు తెచ్చుకున్నాడు. సినిమాల్లోకి రాకముందు త్రివేండ్రంలో ఒక ఒక ఇడ్లీ కొట్టు నడిపేవాడు. అది కూడా రోడ్ సైడ్ చిన్న బండి.దానిమీద వచ్చే ఆదాయంతోనే వారి కుటుంబం బతికేది. ఇక సోషల్ మీడియా వచ్చాకా ఆ హోటల్ లోనే రీల్స్, వీడియోస్ చేసి వెంకిటేష్ బాగా పాపులర్ అయ్యి .. అలా సినిమాల్లోకి అడుగుపెట్టాడు.
ఇక మోహన్ లాల్ నటించిన ఒడియన్ సినిమా వెంకిటేష్ కు మంచి గుర్తింపు తీసుకొచ్చి పెట్టింది. ఆ తరువాత పలు సినిమాల్లో నటిస్తూ.. చివరకు కింగ్డమ్ తో తెలుగుకు పరిచయం కానున్నాడు. విజయ్ దేవరకొండ, భాగ్యశ్రీ బోర్సే జంటగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కిన కింగ్డమ్ సినిమాను సితార ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నాడు. ఇప్పటికే కింగ్డమ్ సినిమా నుంచి రిలీజైన ట్రైలర్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో ప్రమోషన్స్ మొదలుపెట్టిన మేకర్స్.. గతరాత్రి కింగ్డమ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించారు. ఈ వేడుకలో వెంకిటేష్ హైలైట్ అయ్యాడు. అతను ఇచ్చిన 10 నిమిషాల స్పీచ్ తెలుగు యువతను కట్టిపడేసింది. ఈ స్టేజి వరకు రావడానికి తొమ్మిదేళ్లు పట్టిందని, తెలుగు వారి అభిమానాన్ని సంపాదించుకున్నట్లు ఎంతో చక్కగా తెలుగులో మాట్లాడాడు. అంతేనా అంత ఎనర్జీ.. కింగ్డమ్ లో నటించిన ప్రతి ఒక్కరి గురించి ఎంతో అద్భుతంగా మాట్లాడాడు.
ఇక ట్రైలర్ లో మురుగన్ పాత్రలో వెంకిటేష్ కనిపించాడు. అసలు ఆ కళ్లు.. ఆ కోపం ఫర్ఫెక్ట్ విలన్ గా సెట్ అయ్యాడు. ఇంకా చెప్పాలంటే విజయ్ కన్నా వెంకిటేష్ నే ఎక్కువ హైలైట్ అయ్యాడని చెప్పొచ్చు. అలా ఒక్క విలన్ పాత్రతో ఓవర్ నైట్ స్టార్ గామారిపోయాడు. ఇప్పటివరకు కింగ్డమ్.. విజయ్, గౌతమ్ తిన్ననూరి, భాగ్యశ్రీకి హిట్ ను తీసుకురావాలని కోరుకున్నారు. ఇక ఇప్పుడు వీరితో పాటు వెంకిటేష్ కు కూడా మంచి విజయం అందివ్వాలని కోరుకుంటున్నారు.
3BHK OTT: నెలలోపే ఓటీటీలోకి సిద్దార్థ్ సినిమా