3BHK OTT: నెలలోపే ఓటీటీలోకి సిద్దార్థ్ సినిమా
ABN , Publish Date - Jul 29 , 2025 | 03:34 PM
కోలీవుడ్ హీరో సిద్దార్థ్ (Siddharth), శరత్ కుమార్, దేవయాని, మీతా రంగనాథన్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం 3 BHK.
3BHK OTT: కోలీవుడ్ హీరో సిద్దార్థ్ (Siddharth), శరత్ కుమార్, దేవయాని, మీతా రంగనాథన్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం 3 BHK. శ్రీ గణేష్ దర్శకత్వం వహించిన ఈ సినిమా జూలై 7 న రిలీజ్ అయ్యి పాజిటివ్ టాక్ ను అందుకుంది. సొంత ఇల్లు కోసం ఒక తండ్రి.. ఎంతలా శ్రమించాడు అనేది ఈ సినిమాలో ఎంతో హృద్యంగా చూపించారు. శరత్ కుమార్ తండ్రిగా కనిపించగా.. సిద్దార్థ్ కొడుకుగా నటించాడు.తెలుగు , తమిళ్ భాషల్లో ఏకకాలంలో రిలీజ్ అయిన ఈ సినిమా నెల తిరక్కుండానే ఓటీటీలో స్ట్రీమింగ్ కావడానికి సిద్ధమైంది.
3 BHK సినిమా ఆగస్టు 1 నుంచి సింప్లీ సౌత్ అనే ఓటీటీలో స్ట్రీమింగ్ కు సిద్దమవుతుంది. అయితే ఇది ఇండియాలో ఉండేవారికి కాదు. వేరే దేశాల్లో ఉన్న తెలుగువారు చూడడానికి మాత్రమే. అంటే తెలుగులో ఇంకా ఈ సినిమా స్ట్రీమింగ్ డేట్ ను ఫిక్స్ చేసుకోలేదని తెలుస్తోంది. అందుతున్న సమాచారం ప్రకారం ఆగస్టు 8 నుంచి అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కానున్నట్లు టాక్ నడుస్తోంది. ఇదే కనుక నిజమైతే మేకర్స్ త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నారు.
3 BHK కథ విషయానికొస్తే.. వాసుదేవ్ (శరత్ కుమార్), శాంతి (దేవయాని) మధ్యతరగతి దంపతులు. వీరికి ఇద్దరు పిల్లలు, ప్రభు (సిద్థార్థ్), ఆర్తి (మీథా రఘునాథ్). సొంత ఇల్లు కొనుక్కోవాలనేది వారి కల. ప్రభు పదో తరగతిలో ఉన్నప్పటి నుంచి బీటెక్ పూర్తి చేసేవరకు... ఆ తర్వాత ప్రభు పెళ్లి వరకు... వాసుదేవ్ కుటుంబం ఎన్నో సార్లు ఇల్లు కొనాలని అడ్వాన్స్ ఇవ్వడానికి వెళ్లి ఆర్థిక పరిస్థితి సహకరించక వెనక్కి వచ్చేయడంతో వారి సొంత ఇంటి కల ..కలగానే మిగిలిపోతుంది. చివరకు ప్రభు ఇల్లు కొన్నాడా? సొంత ఇల్లు అనేది ఓ గౌరవం అని నమ్మే తన తండ్రి కోరిక నెరవేరిందా? ఈ మధ్యలో ఆర్తి పెళ్లి ఆ తర్వాత వచ్చిన సమస్య, ఐశ్వర్యతో ప్రభు ప్రేమ ఇవన్నీ ఎలా నడిచాయి అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. మరి థియేటర్ లో ఆశించినంత ఫలితాన్ని అందుకోలేని ఈ సినిమా ఓటీటీలో ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.
Hrithik Roshan: 'వార్ 2' కోసం 'బ్రహ్మాస్త్ర' టీమ్...
Aha Video: నెలాఖరు నుండి 'నెట్ వర్క్' వెబ్ సీరిస్