Kamal - Rajani: కమల్‌ - రజనీ మల్టీస్టారర్‌ దర్శకుడు క్లారిటీ..

ABN , Publish Date - Oct 07 , 2025 | 04:50 PM

నాలుగున్నర దశాబ్ధాల తర్వాత ఒకే సినిమాలో కనిపించనున్న సంగతి తెలిసిందే! వీరిద్దరూ కలిసి ఓ మల్టీస్టారర్‌ (Multistarrer) చేయబోతున్నారని అధికారిక ప్రకటన వచ్చినప్పటి నుంచి ఈ సినిమా గురించి ఏదో ఒక వార్త నెట్టింట హల్‌చల్‌ చేస్తోంది.

నాలుగున్నర దశాబ్ధాల తర్వాత ఒకే సినిమాలో కనిపించనున్న సంగతి తెలిసిందే! వీరిద్దరూ కలిసి ఓ మల్టీస్టారర్‌ (Multistarrer) చేయబోతున్నారని అధికారిక ప్రకటన వచ్చినప్పటి నుంచి ఈ సినిమా గురించి ఏదో ఒక వార్త నెట్టింట హల్‌చల్‌ చేస్తోంది. తొలుత ఈ చిత్రానికి లోకేష్‌ కనకరాజు దర్శకత్వం వహిస్తారని వార్తలొచ్చారు. వాటిని దర్శకుడు కొట్టిపారేశారు.  ఈ ప్రాజెక్ట్‌లో భాగం కాదని లోకేశ్‌ (lokesh Kanajakaraj) చెప్పారు. తదుపరి ప్రదీప్‌ రంగనాథన్‌ (Pradeep Ranganathanఈ చిత్రానికి దర్శకుడని నెట్టింట వార్తలు వైరల్‌ అయ్యాయి. ఇప్పుడు దీనిపై ప్రదీప్‌ క్లారిటీ ఇచ్చారు.  ‘ఆ రజనీకాంత్‌, కమల్‌హాసన్‌ల మల్టీస్టారర్‌ చిత్రానికి దర్శకత్వం వహించే అవకాశం నాకు వచ్చిందో లేదో నేను చెప్పను. కానీ నేనీ ప్రాజెక్ట్‌లో భాగం కాదు.  ఎందుకంటే ప్రస్తుతం దర్శకత్వం మీద కంటే యాక్టింగ్‌ మీదే ఫోకస్‌ పెట్టాలనుకుంటున్నాను. ఈ మల్టీస్టారర్‌ గురించి ఇంతకన్నా ఏం చెప్పలేను. నేను రజనీకాంత్‌కు వీరాభిమానిని. ఇప్పటివరకూ విడుదలైన ఆయన సినిమాలు మొదటిరోజు మొదటి ఆట చూశాను. ‘డ్రాగన్‌’ విడుదలయ్యాక ఆయన నన్ను ప్రశంసించారు. ఆ మాటలు ఎప్పటికీ మర్చిపోలేను’’ అని ప్రదీప్‌ అన్నారు.

 
ఈ మధ్యన జరిగిన  సైమా అవార్డుల వేడుకలో కమల్‌హాసన్‌ ఈ మల్టీస్టారర్‌ గురించి అధికారికంగా తెలిపారు. ‘మీరు, రజనీకాంత్‌ కాంబినేషన్‌లో ఓ సినిమాను ఆశించవచ్చా’ అని వ్యాఖ్యాత అడిగిన ప్రశ్నకు ఆయన జవాబిచ్చారు. ‘ప్రేక్షకులు మా కాంబినేషన్‌ను ఇష్టపడటం మంచితే కదా. అభిమానులు, ప్రేక్షకుల ఆనందమే మా ఆనందం. మేమిద్దరం కలిసి నటించాలని ఎన్నో ఏళ్లుగా ప్రయత్నిస్తూనే ఉన్నాం. కానీ, ఇన్ని రోజులు అది కుదర్లేదు. త్వరలోనే మీ ముందుకు కలిసిరానున్నాం. అది మిమ్మల్ని సర్‌ప్రైజ్‌ చేస్తుంది’ అని స్పష్టంచేశారు.  

ALSO READ: Anikha Surendran: అజిత్ రీల్ కూతురు.. దేవుడా ఈ రేంజ్ లో రెచ్చిపోయిందేంటి

Venkatesh: శతదినోత్సవం చూసిన 'జయం మనదేరా'

Srikantha Addala: కిరణ్‌ అబ్బవరం మూవీ డైరెక్టర్ మారిపోయాడా...

Updated Date - Oct 07 , 2025 | 06:09 PM